రూ.1200 కోసం ముగ్గురు ఫ్రెండ్స్‌పై హత్యాయత్నం.. హైదరాబాద్‌లో దారుణం


హైదరాబాద్ నగరంలో జరుగుతున్న వరుస నేర ఘటనలు కలకలం రేపుతున్నాయి. చాదర్‌ఘాట్, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు దారుణహత్యకు గురైన ఘటనలు మరువకముందే పాతబస్తీలో మరో ఘోరం జరిగింది. పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాబా నగర్‌లో స్నేహితుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఓ యువకుడు ముగ్గురిని కత్తితో పొడిచి పరారయ్యాడు. కేవలం రూ.1200 నగదు విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముగ్గురు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. Also Read: వివరాల్లోకి వెళ్లితే... బాబానగర్ ప్రాంతానికి చెందిన మోహసీన్, ఈర్షద్, అర్షద్ స్నేహితులు. సోమవారం రాత్రి మెడికల్ షాప్‌కి వెళ్లిన వారు రూ.1200 నగదు విషయంలో మాటామాటా అనుకుని ఘర్షణ పడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తు్న్న అలీ అనే వారి స్నేహితుడు ముగ్గురిని వారించాడు. అదే సమయంలో మోహసీన్ వెంట తెచ్చుకున్న కత్తితో మిగిలిన ముగ్గురిపై దాడి చేసి పారిపోయాడు. తీవ్రగాయాలతో బాధితులు కేకలు వేయగా స్థానికులు వారిని హుటాహుటిన సమీపంలోని యశోదా హాస్పిటల్‌కు తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న కంచన్‌బాగ్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు మోహసీన్ కోసం గాలిస్తున్నారు. బాధితుల్లో అర్షద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. Also Read:
By May 12, 2020 at 08:29AM
No comments