పదకొండేళ్ల బాలికపై రేప్.. చంపేస్తానని బెదిరించి.. ప్రకాశంలో దారుణం
ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై కన్నేసిన కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. అభంశుభం తెలియని బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక భయపడిపోయింది. అయితే రక్తంతో తడిసిపోయిన బాలిక బట్టలు గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయడంతో ఘోరం వెలుగుచూసింది. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన పదకొండేళ్ల బాలికను దారుణంగా చేశాడో దుర్మార్గుడు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి రేప్ చేశాడు. అభంశుభం తెలియని బాలికపై పడి తన పశువాంఛ తీర్చుకున్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. Also Read: కామపిశాచి చంపేస్తానని బెదిరించడంతో లైంగిక దాడికి గురైన బాలిక భయపడిపోయింది. తల్లిదండ్రులకు చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. అయితే బాత్రూమ్‌కి వెళ్లొచ్చి బాలిక ఏడుస్తుండడం.. ఆమె బట్టలపై రక్తపు మరకలు గమనించిన తల్లి నెమ్మదిగా ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Read Also:
By April 18, 2020 at 11:16AM
No comments