అసలు సిసలైన హీరో అంటే సంపూర్ణేశ్!
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ ఇంటికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో చిత్రవిచిత్రాలుగా ఛాలెంజ్‌లు.. సోషల్ మీడియాలో లైవ్‌లు ఇస్తూ కాలం గడిపేస్తున్నారు. ఒకరు ఇంటిని శుభ్రం చేస్తూ ఇదిగో ఇలా చేయాలంటూ కొందర్ని నామినేట్ చేస్తే.. ఇంకొందరు ఇదిగో ఫలానా పని చేయండని నామినేట్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇలా ఛాలెంజింగ్‌లు నడుస్తున్నాయి. ‘బీ ద రియల్ మేన్’ అనే ఛాలెంజ్ బాగా ఫేమస్ అయ్యింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు పార్టిసిపేట్ చేయడంతో ఈ ఛాలెంజ్ ఒక్కసారిగా పేలిపోయింది.
అయితే.. అందరిలాగా కాకుండా కమెడియన్ కమ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు లాక్‌డౌన్‌లో ఏం చేశాడో మీరే చూడండి. నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత ‘సంపూ రియల్ హీరో’ అని తప్పకుండా అనుకుండా ఉండలేరు. ఎందుకంటే సంపూ చేసిన పని అలాంటిది మరీ. లాక్‌డౌన్ తాను ఇంట్లో చేసిన పని తాలుకూ వీడియోను పోస్ట్ చేసిన సంపూ.. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ట్వీట్ చేశాడు. సంపూ తన వృత్తిని గుర్తు చేసుకుంటూ రాసిన ఆ మాటలు నిజంగా అదుర్స్ అంతే.
నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు!
‘రాజు పేద తేడా లేదు.. నీ ఆస్తి, డబ్బు నీ వెనక రావు.. నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు అని నా నిజమైన స్థానం గుర్తు చేసుకుంటూ మా ఆవిడ కోసం, నా పాత ‘కంశాలి’వృత్తి ని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో, తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేయించి ఇచ్చాను’ అని సంపూ ట్వీట్ చేశాడు. ఈ వీడియో చూసిన జనాలంతా అసలు సిసలైన హీరో అని సంపూను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సెలబ్రిటీలు పెట్టే అతి వీడియోల కంటే నిజమైన వీడియో ఇది అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.
By April 24, 2020 at 07:09PM
No comments