విడాకులిచ్చిన భార్య... ఒంటరితనాన్ని భరించలేక భర్త ఆత్మహత్య
ఒంటరితనాన్ని భరించలేక ఓ వ్యక్తి చేసుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. టి.నరసాపురం మండల కేంద్రానికి చెందిన బైగాని రాంబాబు(35) అనే వ్యక్తికి చాలా ఏళ్ల క్రితం ఓ యువతితో వివాహమైంది. అయితే మనస్పర్థల కారణంగా పదేళ్ల క్రితం వారిద్దరు విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నారు. Also Read: అప్పటి నుంచి ఏలూరులో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న రాంబాబు టి.నరసాపురంలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. కరోనా వైరస్ కారణంగా సంస్థ మూతపడటంతో కొద్దిరోజులుగా గదికే పరిమితమయ్యాడు. దీంతో ఒంటరితనాన్ని భరించలేక మనోవేదనకు గురై ఆదివారం రాత్రి పురుగుల మందు తాగేశాడు. Also Read: అతడిని గమనించిన స్థానికులు బంధువులకు సమాచారమిచ్చారు. దీంతో వారు రాంబాబును వెంటనే చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాంబాబు తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By April 21, 2020 at 09:03AM
No comments