Breaking News

ప్రేమ పేరిట లైంగిక దాడి.. గర్భం దాల్చిన మైనర్ బాలిక


ప్రేమ పేరుతో బాలికను మోసం చేసిన మైనర్ బాలుడిపై ప్రకాశం జిల్లా బేస్తవారపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై రవీంద్రారెడ్డి కథనం మేరకు... బేస్తవారపేట మండలానికి చెందిన బాలిక(18), బాలుడు(18) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించిన ఆ బాలుడు ఆమెను లైంగికంగా దోచుకున్నాడు. అనేకసార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతో బాలిక గర్భం దాల్చింది. Also Read: ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పి చేసుకోవాలని కోరగా అతడు నిరాకరించాడు. ఆమె గర్భానికి తనకు సంబంధం లేదని చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By April 28, 2020 at 10:49AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/police-booked-pocso-case-on-minor-boy-in-prakasam-district/articleshow/75421604.cms

No comments