కరోనా వైరస్ లైప్ అప్‌డేట్స్: కరోనా దెబ్బకు చిగురుటాకులా వణుకుతోన్న అమెరికా

⍟ అమెరికాలో కేసుల సంఖ్య రెండున్నర లక్షలకు చేరువలో ఉంది. ప్రపంచంలోని మరే దేశంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో వైరస్ బారినపడలేదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంలోనే వైరస్ కేసులు అధికంగా నమోదుకావడంతో ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురయింది. సంపన్నమైన దేశం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకుని జీవశాస్త్ర పరిశోధనల్లోనూ అందరికన్నా ముందున్న అమెరికాలో పరిస్థితికి వారి స్వయంకృతాపరాధమే కారణమనే వాదన వినబడుతోంది. ⍟ ప్రపంచవ్యాప్తంగా కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. రోజు రోజుకూ మహమ్మారి మరింత తీవ్రమవుతూ ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడినవారి సంఖ్య ఒక మిలియన్ దాటింది. ఒక్క ఐరోపా ఖండంలోనే 5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోని 200 దేశాలకు కరోనా వైరస్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ⍟ కేసులు పెరగడానికి నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలు ప్రధాన కారణమయ్యాయి. దక్షిణ కొరియాలో కరోనా బాధిత మహిళ సృష్టించిన కల్లోలం మాదిరిగానే ప్రస్తుతం దేశాన్ని నిజాముద్దీన్ మర్కజ్ భయకంపితులను చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మార్చి 1 నుంచి 15 వరకు నిర్వహించిన మతపరమైన కార్యక్రమాల్లో విదేశీయులు సహా పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది పాల్గొన్నారు. ⍟ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం మరింతగా అప్రమత్తమైంది. ముఖ్యంగా దిల్లీలోని నిజాముద్దీన్‌లో మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి ప్రాంతాల్లోనే ఎక్కువగా కేసులు నమోదవుతుండడంతో వ్యూహాన్ని మార్చింది. ⍟ కరోనా టెన్షన్, లాక్‌డౌన్ వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఇబ్బందులు, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు. తనవంతుగా వారికి సాయం చేసే పనిలో ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వందలాదిమందికి సాయం అందేలా చేశారు. తాజాగా యూకేలో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల సమస్యని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.. కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి స్పందించారు. ⍟ కరోనా కట్టడికి అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్ ఓ నిరుపేద మహిళ పరిస్థితిని తలక్రిందులు చేసింది. 10 రోజులు పనులు లేకపోవడంతో బిడ్డలకు తిండి పెట్టలేక సతమతమైంది. దీనికి తోడు అనారోగ్యానికి గురికావడంతో పట్టించుకునే నాథుడు లేదు. పిల్లలందరూ పదేళ్ల వయస్సు లోపువారే కావడంతో తల్లికి ఏం జరిగిందో తెలియలేదు. లాక్‌డౌన్ కారణంగా స్థానికులెవరూ కూడా ఆమె పరిస్థితిని గమనించలేదు.. ⍟కరోనా వైద్య సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రికి పోలీసుల భద్రతను కట్టుదిట్టం చేశారు. బుధవారం కరోనా పాజిటివ్ రోగులు డాక్టర్లపై దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 200 మంది పోలీసులతో గాంధీ ఆస్పత్రికి భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ⍟ కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ చాలా మంది బాధ్యత లేకుండా లాక్ డౌన్ ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వస్తున్నారు. మరోవైపు, దేశంలోనూ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది
By April 03, 2020 at 09:03AM
No comments