Breaking News

చైతన్య ఒళ్లో గురకపెట్టి పడుకున్న శునకం.. మురిసిపోతున్న సమంత


టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత ఈ లాక్‌డౌన్ సమయాన్ని తమ శునకంతో చాలా ఆనందంగా గడుతున్నారు. తమ శునకంతో ఆడుకుంటున్న, సేదతీరుతోన్న ఫొటోలను ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత పోస్ట్ చేశారు. అయితే, తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటో, చిన్న వీడియో ఆసక్తికరంగా ఉన్నాయి. ఎందుకంటే, సాధారణంగా శునకాలు నేలపై పడుకుంటాయి. పెద్దోళ్ల ఇళ్లలో మంచం మీద వాళ్ల పక్కనే పడుకుంటాయి. కానీ, సమంత శునకం మాత్రం ఆమె భర్త ఒళ్లో దర్జాగా బజ్జుంది. అది కూడా గురకతీస్తూ డీప్ స్లీప్‌లోకి వెళ్లిపోయింది. సమంతకు పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టమట. అందుకే, ఆమె ఒక బుల్‌డాగ్‌ను పెంచుకుంటున్నారు. దీనికి హాష్ అని పేరు పెట్టారు. ఈ శునకానికి తొలి బర్త్‌డేను కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఎప్పటికప్పుడు ఆ డాగ్‌తో ఫొటోలు తీసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి మురిసిపోతూ ఉంటారు. అయితే, ఇప్పుడు నాగచైతన్య ఒళ్లో అది గురకపెడుతూ నిద్రపోతోన్న వీడియోను సమంత పోస్ట్ చేసి మరింత మురిసిపోతున్నారు. ఈ పోస్ట్‌తో నాగచైతన్య క్వారంటైన్‌ లుక్‌ను కూడా సమంత బయటపెట్టారు. ఇక అన్యోన్య దంపతుల సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సినిమా చేస్తు్న్నారు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకి ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పవన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక, ఈ ఏడాది ‘జాను’ సినిమాతో పలకరించిన సమంత.. ఆ తరవాత మరే తెలుగు సినిమాను అంగీకరించలేదు.


By April 26, 2020 at 01:17PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/samantha-akkineni-shares-hubby-naga-chaitanya-quarantine-look/articleshow/75388064.cms

No comments