Breaking News

అక్కను ఆస్పత్రికి తీసుకెళ్తూ రోడ్డుప్రమాదంలో తమ్ముడి మృతి


నిండు గర్భిణి అయిన అక్కను వైద్య పరీక్ష కోసం ఆస్పత్రికి తీసుకెళ్తున్న తమ్ముడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన జిల్లాలో జరిగింది. బొమ్మనహాళ్‌ మండలం గోవిందవాడకు చెందిన అశోక్‌ (23), తన అక్క సుస్మితను(9 నెలల గర్భిణి) తీసుకొని బుధవారం ఆర్డీటీ ఆస్పత్రిలో టెస్టుల బైక్‌పై బయల్దేరాడు. Also Read: మరోవైపు కుందుర్పి మండలం శీగలపల్లికి చెందిన రంగస్వామి బొమ్మనహాళ్‌ వద్ద పని చేస్తున్నాడు. ఉదయాన్నే తమ్ముడు శివతో కలిసి బైక్‌పై పనికి బయల్దేరాడు. హులికల్లు వద్దకు రాగానే వీరిద్దరి బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అశోక్‌ అక్కడికక్కడే మృతి చెందగా... సుస్మిత, రంగస్వామి, శివలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కర్ణాటకలోని బళ్లారి ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు పరీక్షించి సుస్మితకు తీవ్రగాయాలు కావడంతో శిశువు గర్భంలోనే మృతి చెందినట్లు చెప్పారు. మరోవైపు చేతికి అందివచ్చిన కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. Also Read:


By April 30, 2020 at 08:39AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-died-in-road-accident-in-anantapur-district-while-go-to-hospital/articleshow/75463039.cms

No comments