రేవతిని పెళ్లాడిన నిఖిల్.. కరోనా ఎఫెక్ట్‌తో సింపుల్‌గా వివాహం
కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు పెద్దలు. ఇవే కాదు కరోనా వచ్చినా కళ్యాణం ఆగదని తెలియజెప్పారు నిఖిల్ గౌడ, రేవతిల జంట. అసలే కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తుండటంతో పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు వాయిదా వేయక తప్పని పరిస్థితి. పాపం ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడినైపోదామా అని ఎదురుచూసిన తెలుగు హీరోలు నితిన్, నిఖిల్‌లు ఇప్పటికే తమ పెళ్లిని వాయిదా వేసుకోగా.. కన్నడ హీరో.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ తనయుడు విషయంలో వెనక్కి తగ్గలేదు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ పరిమితులకు లోబడి అతి తక్కువ మంది బంధువులు, కుటుంబీకుల మధ్య రేవతిని నేటి (ఏప్రిల్ 17) ఉదయం వివాహమాడాడు నిఖిల్ గౌడ. ఇటీవల ఎంతో ఘనంగా వీరి నిశ్చితార్థ వేడుకును నిర్వహించగా.. పెళ్లి కూడా అదే రేంజ్‌లో చేయాలని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కరోనా వల్ల వీరి వివాహం వాయిదా పడుతుందనే వార్తలు రాగా.. ఎట్టిపరిస్థితుల్లోనూ ముందుగా అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు నిర్ణయం తీసుకోవడంతో.. ఈ రోజు ఉదయం బెంగళూరుతోని ఫామ్ హౌస్‌లో 7:30 గంటల నుంచే పెళ్లి కార్యక్రమాన్ని ప్రారంభించి.. ఉదయం 9:30 గంటలకు వివాహా తంతుని పూర్తి చేశారు. జాగ్వార్ సినిమాతో హీరోగా మెరిసిన నిఖిల్ గౌడకు మంచి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉంది. తాత దేవగౌడ మాజీ ప్రధాని కాగా.. తండ్రి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. ఇక నిఖిల్ పెళ్లి చేసుకున్న రేవతి తండ్రి రేవన్న కూడా కన్నడలో మంచి పేరున్న పొలిటికల్ లీడర్.
By April 17, 2020 at 11:57AM
No comments