సినిమా డైలాగ్స్ చెబుతూ... కన్నతండ్రిని కిరాతకంగా చంపిన కొడుకు
వారిద్దరూ తండ్రీ కొడుకులు. కొడుకు వయసు 25 ఏళ్లు. తండ్రి వయసు 55 ఏళ్లు. ఇద్దరూ ఇంట్లో ఉన్నారు. వారిద్దరి మధ్య ఎలాంటి గొడవ జరగలేదు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ ఇల్లు కాస్త భయానకంగా మారిపోయింది. అప్పటివరకు సైలెంట్‌గా ఉన్న బిడ్డ కర్కశకుడిలా మారిపోయాడు. ఉన్నట్టుండి ఉన్మాదిలా మారి కన్నతండ్రినే అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటు చేసుకుంది. నాగపూర్ నివసిస్తున్న 25 ఏళ్ల విక్రమ్ జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. అతని తండ్రి పేరు విజయ్. శనివారం రాత్రి విక్రమ్ ఓ ఉన్నాదిలా మారిపోయాడు. తండ్రిపై ఒక్కసారిగా దాడి చేశాడు. అతడు గొంతును బలంగా కొరికాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావండంతో తండ్రి అక్కడే పడిపోయాడు. తండ్రిని అలాగే ఈడ్చుకెళ్లి వరండాలో పడేశాడు. కత్తితో కన్నతండ్రి జననావయవాలు కోసేశాడు. కొడకు చేతిలో దారుణ హింసకు గురైన తండ్రి అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ భయానక దృశ్యాల్ని కళ్లారా చూసిన తల్లి, సోదరి షాక్‌కు గురయ్యారు. విక్రమ్ ఎందుకిలా చేశాడో వారికీ అర్థం కాలేదు. అడ్డుకునేందుకు వెళ్లడంతో వారిని కూడా బెదిరించాడు. అయితే హత్య చేస్తున్నప్పుడు విక్రాంత్ సినిమా డైలాగులు చెబుతూ దారుణానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకునేందుకు ఐదుగురు కానిస్టేబుళ్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. హుదుకేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై హత్య కేసు నమోదు చేశారు.
By April 27, 2020 at 06:49AM
No comments