మాస్క్ వేసుకోలేదని కొడుకును చంపేశాడు.. కోల్‌కతాలో దారుణం
కరోనా వైరస్ దేశంలో మహమ్మారిగా మారి ప్రజల ప్రాణాలను హరించివేస్తోంది. రోజూ పదుల సంఖ్యలో దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అంతకంతకూ వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రజలంతా బయటకు వచ్చిన సమయంలో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఆదేశాలు జారీచేసింది. చాలామంది దీన్ని సీరియస్‌గా తీసుకుని మాస్కులు ధరిస్తూ వైరస్ బారిన పడకుండా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించలేదన్న కోపంతో ఓ వ్యక్తి కన్నకొడుకునే చంపేశాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని నగరంలో జరిగింది. Also Read: కోల్‌కతాలోని షోవాబజార్‌లో నివాసం ఉండే బన్సిధర్ మల్లిక్(78)కు శీర్షేందు మల్లిక్ (45) అనే కొడుకు ఉన్నాడు. శీర్షేందు దివ్యాంగుడు కావడంతో ఇంటి వద్దనే ఉంటాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దీన్ని గురించి జాగ్రత్తలు తీసుకోవాలని బన్సిధర్ తన కొడుకుని రోజూ హెచ్చరిస్తున్నాడు. శీర్షేందు శనివారం ఓ పని నిమిత్తం బయటకు వెళ్తుండగా మాస్క్ ధరించాలని తండ్రి సూచించాడు. తనకు మాస్క్ ధరించడం ఇబ్బందిగా ఉందని, వేసుకోనని శీర్షేందు చెప్పాడు. దీంతో తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. Also Read: విచక్షణ కోల్పోయిన బన్సిధర్ టవల్‌తో కొడుకు గొంతు బిగించాడు. ఊపిరాడక శీర్షేందుకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బన్సిధర్ వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నేరాన్ని స్వయంగా అంగీకరించడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. Also Read:
By April 19, 2020 at 11:37AM
No comments