కరోనాపై పోరాటం: కదలివస్తున్న హీరోయిన్స్.. తమన్నా విరాళం ఎంతంటే?
కరోనా కల్లోలంలో ఉపాధిలేక కొట్టుమిట్టాడుతున్న పేదవాళ్ళ సహాయార్థం సినీ తారలు పెద్దఎత్తున ముందుకొస్తున్నారు. కరోనాపై ప్రభుత్వం సాగిస్తున్న పోరులో భాగమవుతూ సీఎం, పీఎం సహాయనిధులకు విరాళాలు అందించిన టాలీవుడ్ సినీ ప్రముఖులు.. తమ సినీ కార్మికుల కోసం ప్రత్యేకంగా సహాయసహకారాలు అందిస్తున్నారు. ఈ మేరకు చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ మనకోసం) ఏర్పాటు చేసి సినీ కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ ఛారిటీకి ఇప్పటికే టాలీవుడ్ చిత్రసీమ నుంచి ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి, నాగార్జున లాంటి ఎందరో హీరోలు, డైరెక్టర్లు తమతమ విరాళాలు ప్రకటించగా.. తాజాగా ముందుకొచ్చి తన విరాళం అందించింది. సీసీసీ మనకోసం ఛారిటీకి 3 లక్షల రూపాయలను ఆర్టీజీఎస్ ద్వారా అందించి ఉదారత చాటుకుంది. కరోనా కల్లోల సమయంలో హీరోలు మాత్రమే విరాళాలు అందిస్తున్నారు కానీ హీరోయిన్స్ ముందుకు రావడం లేదని అపవాదులు వచ్చాయి. కానీ ఇప్పటికే లావణ్య త్రిపాఠి 1 లక్ష రూపాయలు, కాజల్ 2 లక్షలు, తమన్నా 3 లక్షలు విరాళాలు ప్రకటించి అలాంటి అపవాదులను చెరిపేశారు. మరోవైపు తెలుగు చిత్రసీమలోని సినీ కార్మికుల కోసం బాలీవుడ్ బడా హీరో అమితాబ్ బచ్చన్ సైతం ముందుకొచ్చి తన విరాళం అందించారు. ఒక్కొక్కటీ 1500 విలువగల 12000 షాపింగ్ కూపన్లను సీసీసీకి అందించారు. కరోనా క్రైసిస్ ఛారిటీకి సహకరిస్తున్న అందరికీ చిరంజీవి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.
By April 19, 2020 at 09:51AM
No comments