పవన్ జోలికొస్తే చెప్పుతో కొడతాం.. శ్రీ రెడ్డి టాపిక్ తీస్తూ తమన్నా సంచలన వ్యాఖ్యలు
సినీ రంగానికి, రాజకీయ రంగానికి ఎంతో తారతమ్యం ఉంటుంది. సినిమా అనేదే ఎంటర్‌టైనింగ్ రంగం కాబట్టి ఓ సినిమా పోతే మరో సినిమా కోసం ఎదురుచూస్తుంటారు. కానీ రాజకీయం అలా కాదు.. ఎన్ని పనులు చేస్తూ వెళ్లినా, జనంతో మమేకమవుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో పాలు పంచుకుంటున్నా కూడా ఏదో ఒక మూల నుంచి విమర్శలు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తనపై ఎన్ని విమర్శలొచ్చినా ఏ మాత్రం జంకకుండా పార్టీని ముందుకు నడిపిస్తూ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు జనసేన అధినేత . ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌ని విమర్శించే వారికి వార్నింగ్ ఇచ్చింది ట్రాన్స్‌జెండర్ . ఓ మీడియాతో ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.. జనసేనకు మద్దతుగా మాట్లాడింది. పవన్ కళ్యాణ్ వెంట తామున్నామని, ఆయనను విమర్శిస్తూ ఎవ్వరైనా పవన్ జోలికొస్తే తాట తీస్తామని చెప్పింది. కొందరు తమ పేరును పాపులర్ చేసుకునేందుకు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తున్నారని, అలాంటి కుక్కలకు సమాధానం చెబుతామని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది తమన్నా. రాకేష్ మాస్టర్, శ్రీరెడ్డి లాంటి వారితో పాటు ఇంకొందరు తమ పాపులారిటీ కోసమే విమర్శలు చేస్తున్నారని ఆమె పేర్కొంది. పవన్ తిట్టి వార్తల్లో నిలవాలని, అలా తమ పేరు ప్రజల నోళ్ళలో నానాలని కొన్ని పిచ్చికుక్కలు ప్రయత్నిస్తున్నాయని తమన్నా ఫైర్ అయింది. ఎవడో తిట్టాడని, వాళ్లందరికీ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, అలాంటి వారిని చెప్పుతో కొట్టేందుకు మేమున్నాం అంటూ రెచ్చిపోయింది తమన్నా. మహిళ కాబట్టి వదిలేశామని, ఈ లాక్‌డౌన్ పూర్తికాగానే పవన్‌ని విమర్శించే వాళ్లను చెప్పుతో కొడతాం అనేసింది తమన్నా. జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి పవన్ చాలా శ్రమిస్తున్నారని ఆమె చెప్పింది. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై పోరాడుతూ సొంత డబ్బుతో పార్టీని నడుపుతున్నారని చెప్పుకొచ్చింది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి టికెట్ వస్తుందని అనుకున్నా, కానీ రాకపోవడంతో ఏ పార్టీలో చేరకుండా ఇండిపెండెంట్‌గా పోటీ చేశానని తెలిపింది. అప్పుడు.. ఇప్పుడు తనది జనసేన పార్టీయే అని, ఎప్పుడూ పవన్ కళ్యాణ్ అభిమానినే అని చెప్పింది తమన్నా సింహాద్రి. Also Read:
By April 30, 2020 at 08:00AM
No comments