Breaking News

భర్తను కాదని పరాయి వ్యక్తితో మహిళ అఫైర్.. చావుబతుకుల్లో ప్రియుడు


తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో మహిళ భర్త మరో వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన భువనగిరి జిల్లా అర్వపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో ఆదివారం రాత్రి జరిగింది. 108లో ఈఎమ్టీగా పనిచేస్తున్న రామన్నగూడేనికి చెందిన తంగెళ్ల నిరంజన్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి అర్వపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలోని ఓ గదిలో నిరంజన్ నిద్రిస్తున్నాడు. అర్థరాత్రి దాటిన తరువాత సూర్యాపేట మండలం రత్నాపురానికి చెందిన ఓ వ్యక్తి కత్తితో అతడిపై దాడి చేశాడు. దీంతో నిరంజన్ మెడ, తలపై తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు అతడిని హైదరాబాద్‌కు తరలించారు. Also Read: దాడిచేసిన వ్యక్తి భార్యతో నిరంజన్‌కు కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రియుడి మోజులో ఆమె భర్తతో విడిపోయి విడిగా ఉంటోంది. భార్యను తన నుంచి విడదీశాడన్న కోపంతోనే ఆ వ్యక్తి నిరంజన్‌పై హత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By April 07, 2020 at 08:29AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/husband-attacks-on-wifes-paramour-in-yadadri-district/articleshow/75019917.cms

No comments