Breaking News

చంద్రబాబుపై చిరంజీవి ప్రశంసలు.. బర్త్ డే విషెస్ చెప్పిన మెగాస్టార్


ఇటీవలే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారు. ప్రతీ విషయంపై సందర్భానుసారం స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్బంగా కూడా మెగాస్టార్ ఓ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘అహర్నిశం ప్రజా సేవలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషం, ఆరోగ్యం ప్రసాదించమని ఆ భగవంతుని కోరుతున్నాను. విషింగ్ యూ ఏ హ్యాపీ 70th బర్త్ డే సార్, మీ విజన్, మీ హార్డ్ వర్క్, మీ అంకితభావం ఎంతో గొప్పవి ’అంటూ ట్వీట్ చేశారు. ట్వీట్ తో పాటు గతంలో చంద్రబాబుతో సరదాగా దిగిన ఒక ఫోటోను కూడా చిరు షేర్ చేశారు. మరోవైపు టీడీపీ అధినేత పుట్టినరోజు వేడుకల్ని టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా పాలుకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానయుడు పలువురికి నిత్యావసరాలను పంపిణీ చేశారు. ధర్మారావు ఫౌండేషన్ ద్వారా పాలకొల్లులో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, కోర్టు గుమస్తాలు, పేదలకు బియ్యం, నిత్యవసర వస్తువులు, కాయగూరలు, దుస్తులు, మాస్కులను ఎమ్మెల్యే ఉచితంగా పంపిణీ చేశారు.


By April 20, 2020 at 09:42AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/megastar-chirnajeevi-birthday-wishes-to-ap-ex-cm-chandrababu-naidu/articleshow/75242991.cms

No comments