Breaking News

సుప్రీంకోర్టు ఉద్యోగికి కరోనా.. క్వారంటైన్‌కు ఇద్దరు రిజిస్ట్రార్‌‌లు


కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి నియంత్రణకు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. సుప్రీంకోర్టులో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది . దీంతో సుప్రీం కోర్టు ఇద్దరు రిజిస్ట్రార్ల ను క్వారంటైన్ కు పంపారు. జ్యుడీషియల్ విభాగంలో పనిచేసే ఆ ఉద్యోగి ఈనెల 16న విధులకు హాజరయ్యారు. ఆ తర్వాత రెండురోజులు జ్వరంతో బాధపడ్డారు. ఆయనకు కరోనా సోకినట్లు సోమవారం నిర్ధారణ అయ్యింది. 16న ఆయన ఇద్దరు రిజిస్టార్లతో సన్నిహితంగా మెలిగారు. దీంతో ఆ ఇద్దర్నీ కూడా సెల్ఫ్ క్వైరంటైన్‌కు వెళ్లాలని అధికారులు సూచించారు. 16 నుంచి విధులకు హాజరవుతున్న ఉద్యోగులందరికీ కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. మరోవైపు ఢిల్లీలో సిబ్బంది మంత్రిత్వ శాఖ శిక్షణ విభాగం అధికారి ఒకరు మరణించారు. దీంతో పాత జేఎన్‌యూ ఆవరణలోని శిక్షణ విభాగం భవనానికి అధికారులు సీల్ వేశారు. కార్యాలయ ఉద్యోగులను కొన్ని రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశించారు. అయితే మరణించిన అధికారి కరోనా వైరస్‌తో బాధపడుతున్నారా లేదని ఇంకా తెలియలేదు. ఆయన పోస్టుమార్టం నివేది కోసం ఎదురు చూస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు 3108కు చేరుకున్నాయి. అందులో 2177 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 877 మంది వ్యాధి నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 54మంది మరణించారు. అయితే గత రెండు రోజుల్లో ఒక్క రోగి కూడా కరోనాతో మరణించలేదు. అలాగే గత 24 గంటల్లో ఒక్క రోగి అయినా కోలుకున్నట్లు ఎటువంటి రిపోర్ట్ కూడా లేదు. కాగా ఢిల్లీలో హాట్‌స్పాట్-కంటైన్మెంట్ జోన్‌ల సంఖ్య 97 కి పెరిగింది. ఈ ప్రాంతాల్లోని ప్రజల రాకపోకలు నిషేధించారు. అన్ని దుకాణాలు మూసివేశారు.


By April 28, 2020 at 08:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-staffer-tests-positive-for-coronavirus/articleshow/75419369.cms

No comments