ఇంటి పనులు చేస్తున్న మెగాస్టార్.... వీడియో పోస్ట్
ఉగాది రోజాన సోషల్ మీడియాలోకి మెగా ఎంట్రీ ఇచ్చిన ... చాలా యాక్టివ్‌గా ఉన్నారు. రోజూ ఏదో ఓ ట్వీట్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. ముఖ్యంగా కరోనాపై అవగాహన కల్గించేందుకు తన వంతుగా ప్రయత్నం చేస్తున్నారు. తన తొలి ట్వీట్‌గా కరోనాని జయించేందుకు ప్రతి ఒక్కరం ఇంటి పట్టునే ఉందాం అని పిలుపునిచ్చారు చిరు. ఆ రోజు నుండి ఇవాల్టి వరకు చిరంజీవి ప్రతి రోజు కరోనాకి సంబంధించి ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకుందామని చెబుతూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. తన ఇంటి పరిసరాలలో స్ప్రే కొడుతున్న వీడియోని కూడా షేర్ చేశారు. లాక్‌డౌన్ యాక్టివిటీస్‌లో భాగంగా తాను ఈ పని చేస్తున్నాను అని చిరంజీవి పేర్కొన్నారు. తాజాగా బుధవారం మెగా ఫ్యామిలీతో కలిసి కూడా చిరంజీవి కరోనాపై పోరాడాలంటూ ఓ మెసేజ్ ఇచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ మెగా ఫ్యామిలీతో పాటు అల్లు అరవింద్ ఫ్యామిలీ కూడా కనిపించింది. ప్లకార్డులు ప్రదర్శించిన వారిలో.... చిరంజీవి, అల్లు అరవింద్ , నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్, ఉపాసన, సుస్మిత, అల్లు శిరీష్, నిహారిక, సాయిధరమ్ తేజ్ , వైష్ణవ తేజ్, చిరంజీవి చిన్నకూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్ కూడా ఉన్నారు. ఈ ఫోటోల్ని కూడా ఎవరింట్లో వాళ్లు ఉంటూ షూట్ చేసి పోస్టు చేశారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మనమంతా కలిసికట్టుగా ఈ యుద్ధాన్ని గెలుద్దాం. ‘మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉందాం. మనతో పాటు... మన ప్రియమైనవారిని, ఈ ప్రపంచాన్ని రక్షిద్దాం’ అని చిరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న చిరంజీవి లాక్ డౌన్ వలన ఆ సినిమాకి తాత్కాలిక బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా స్టోరీని కూడా ఇటీవలే ఓ ఇంటర్య్వూలో మెగాస్టార్ రివీల్ చేశారు.
By April 16, 2020 at 11:14AM
No comments