Breaking News

కోతి కోసం వేటాడుతూ కరెంట్ షాక్‌తో చిరుత మృతి


ఆహారం కోసం కోతిని పట్టుకునేందుకు ప్రయత్నించిన ఓ చిరుత పులి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబయి శివారులో వెలుగుచూసింది. కోతిపైకి దూకిన చిరుత ట్రాన్స్‌ఫర్‌పై పడి కరెంట్ షాక్‌తో చనిపోయింది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబవ్ గ్రామంలో ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో సోమవారం సంచరించింది. Also Read: ఆకలితో ఉన్న దానికి ఓ కోతి కనిపించింది. దీంతో కోతి చంపి తిని ఆకలి తీర్చుకోవాలనుకుంది. కోతి భయంతో ట్రాన్స్‌ఫార్మర్‌పైకి దూకగా.. చిరుత కూడా దానిపైకి దూకింది. దీంతో ఆ రెండూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాయి. ట్రాన్స్‌‌ఫార్మర్‌పై చిరుత మృతదేహం వేలాడుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు కోతి, చిరుత కళేబరాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. లాక్‌డౌన్ కారణంగా జనసంచారం లేకపోవడం వల్లనే చిరుత ఆ ప్రాంతానికి వచ్చినట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. Also Read:


By April 14, 2020 at 12:09PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/leopard-chases-monkey-in-maharastra-both-get-electrocuted/articleshow/75135698.cms

No comments