Breaking News

హాస్పిటల్‌లో అమ్మను చూడటానికి పోలీస్ పాస్... ఆమె చనిపోవడంతో తిరిగిచ్చేసిన యువతి


మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ పటిష్ఠంగా అమలవుతోంది. కర్ణాటకలోనూ వైరస్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలను రోడ్లపైకి రానీయకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అత్యవసరమైతే అనుమతి పాస్‌లు జారీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు పాస్ మంజూరు చేయాలని ఓ యువతి పోలీస్ అధికారులను కోరింది. కేన్సర్‌తో బాధపడుతోన్న తన తల్లి బెంగళూరులోని ఓ హాస్పిటల్ చికిత్స పొందుతోందని, చివరి ఘడియల్లో ఉన్న ఆమె వెన్నంటి ఉండటానికి తనకు పాస్ ఇవ్వాలని అర్ధించింది. ఐజీపీ (రైల్వేస్) డీ. రూప సాయం కోరిన ఆ యువతి.. డీసీపీ శరనప్పకు పాప్ కోసం దరఖాస్తు చేసింది. తన తల్లిని కలవడానికి అనుమతించాలని కోరుతూ చికిత్స సంబంధించిన పత్రాలను జతచేసింది. ఆ యువతి అభ్యర్థను వెంటనే స్పందించిన .. తక్షణమే ఆమెకు పాస్ మంజూరు చేయాలని ఏప్రిల్ 8న డీసీపీకి ట్వీట్ చేశారు. కేన్సర్‌తో బాధపడుతూ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న తన తల్లిని చూడటానికి ఓ యువతి తన సాయం అర్ధించింది.. తండ్రితో కలిసి హాస్పిటల్‌కు వెళ్లడానికి పాస్ ఇవ్వాలని కోరింది.. ఐదు నిమిషాల్లోనే ఆమె అభ్యర్థనపై స్పందించి.. తక్షణమే పాస్‌లు మంజూరు చేయాలని డీసీపీని కోరాను’ అంటూ ఐజీపీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీంతో ఆమెకు తక్షణమే పోలీసులు పాస్‌లు జారీచేశారు. అయితే, ఆమె కొన్ని రోజులకే చనిపోయింది. చివరి రోజుల్లో తన తల్లిని చూసుకోవడానికి అవకాశం కల్పించిన పోలీసులుకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఐజీపీ రూపకు ఆమె ఈ విషయాన్ని తెలియజేస్తూ... ‘ పాస్ పొందడానికి మాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు.. ఆమె జీవితంలో చివరి క్షణాల్లో తన గడపడానికి నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు.. చివరి గడియల్లో ఆమెతో గడపడం వల్ల హాస్పిటల్‌లో పొందుతున్నాననే బాధను మరిచిపోయింది. వ్యాధి బాధిస్తున్నా పక్కనే మేము ఉండటంతో అమ్మ సంతోషంగా ఉంది. ఇంకా ఎక్కువ రోజులు బతకదని వైద్యులు తెలిపారు... మా నాన్న, నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నా.. ఎందుకంటే మీరు పోలీసులతో మాట్లాడటం వల్లనే మాకు పాస్ వచ్చింది.. అమ్మ చనిపోయింది.. ఇక పాస్‌లు అవసరంలేదని బయ్యప్పనహళ్లి పోలీసులకు దానిని తిరిగి ఇచ్చేశాను’ అని పేర్కొంది. తల్లి చనిపోయిన బాధలో ఉన్నా పాస్‌ను పోలీసులకు తిరిగి ఇచ్చేసిన ఆ యువతి చర్యలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. దీనిపై ఐజీపీ రూప స్పందిస్తూ... కేన్సర్‌తో బాధపడుతూ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న తన తల్లిని చూడటానికి పాస్ కోసం తనను సంప్రదించిన యువతి చేసిన పనితో తన కళ్లు చమర్చాయి. ఆమెకు బెంగళూరు ఈస్ట్ డీసీపీ పాస్ త్వరగా జారీచేశారు.. కానీ, ఆమె తల్లి చనిపోయినా పాస్‌ను వెంటనే తిరిగి ఇచ్చింది’


By April 18, 2020 at 12:01PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/a-bangalore-women-thanks-police-for-pass-to-visit-ailing-mother-at-hospital-returns-it-when-she-dies/articleshow/75216919.cms

No comments