వివాహేతర సంబంధానికి ఒప్పుకోలేదని.. వివాహిత గొంతు కోసి
తనతో వివాహేతర సంబంధానికి ఒప్పుకోలేదన్న అక్కసుతో ఓ వ్యక్తి వివాహితపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన తెలంగాణలోని జిల్లా యాలాల మండలంలో మంగళవారం జరిగింది. యాలాలలోని మిత్రనగర్‌కు చెందిన పద్మ భర్తను వదిలి కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటోంది. ఉపాధి కోసం టీ కొట్టు నిర్వహిస్తూ స్థానికంగా నివాసముంటోంది. ఈ క్రమంలోనే అదే మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన నర్సింహులు ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. తనతో వివాహేతర సంబంధం పెట్టుకుంటే తానే పోషిస్తానని తరుచూ ఆమె ఇంటికి వచ్చి ఒత్తిడి తెస్తున్నాడు. అయితే తనకు అలాంటి ఉద్దేశం లేదని పద్మ అతడి ప్రతిపాదనను నిరాకరిస్తూ వస్తోంది. దీంతో ఆమెపై పగ పెంచుకున్న నర్సింహులు మంగళవారం ఉదయం 5గంటల ప్రాంతంలో టీ కొట్టు వద్ద ఉన్న పద్మపై కత్తితో దాడి చేసి గొంతు కోసి పరారయ్యాడు. స్థానికులు ఆమెను వెంటనే తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఈఎన్‌టీ ఆసుపత్రికి తరలించారు. పద్మ మామ చంద్రయ్య ఫిర్యాదు మేరకు పోలసులు నర్సింహులుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
By April 29, 2020 at 09:24AM
No comments