మరిదిపై కోపం.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపేసిన మహిళ


నవమాసాలు కనిపెంచిన పిల్లలను కన్నతల్లే విషమిచ్చి చంపేసిన దారుణ ఘటన తమిళనాడులో జరిగింది. తిరుచ్చి జిల్లా కముదిరం ప్రాంతానికి చెందిన ఓ మహిళకు కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కొడుకు, ఇద్దరు కుమార్తెలున్నారు. కొంతకాలం క్రితం ఆమె భర్త అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో ఆమె ముగ్గురు పిల్లలతో అత్తింట్లోనే ఉంటోంది. Also Read: ఈ నెల 19న ఇంట్లో రూ.2 వేలు కనిపించకపోవడంతో గొడవ జరిగింది. ఆమె మరిది అందరినీ అనుమానిస్తూ ఇష్టం వచ్చినట్లు తిట్టి బయటకు వెళ్లిపోయాడు. అయితే మరిది తనపై అనుమానంతోనే తిట్టాడని భావించిన ఆమె ఇద్దరు కుమార్తెలకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగించింది. బాలికలు నురగలు కక్కుకోవడంతో ఆందోళన పడిన కుటుంబసభ్యులు వారికి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఇద్దరు బాలికలు శుక్రవారం చనిపోయారు. Also Read: కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. తన మరది డబ్బుల విషయంలో తనను అవమానిస్తూ మాట్లాడాడని, అతడిపై కోపంతోనే తన బిడ్డకు విషమిచ్చి చంపినట్లు ఆమె విచారణలో చెప్పింది. దీంతో పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By April 26, 2020 at 10:42AM
No comments