ఫేస్‌బుక్‌లో యువతి ఫోన్ నంబర్... రాత్రికి వస్తావా? అంటూ వేధింపులు

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. కొందరేమో మనకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు మాయం చేస్తున్నారు. మరికొందరేమో అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటనల వల్ల బాధితులు మానసిక ఆందోళనకు గురై ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. Also Read: సికింద్రాబాద్ పరిధిలోని వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన ఓ యువతికి కొద్దిరోజులుగా రోజూ పదుల సంఖ్యలో ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. కొందరేమో ప్రేమిస్తున్నామని వేధిస్తుండగా, మరికొందరేమో రాత్రికొస్తావా? రేటెంత? అంటూ అసభ్యంగా మాట్లాడుతున్నారు. మీకు నా నంబర్ ఎవరిచ్చారు అని యువతిని నిలదీయగా ఫేస్‌బుక్‌లో చూశామని చెప్పేవారు. Also Read: రోజురోజుకీ వేధింపులు ఎక్కువ కావడంతో విసిగిపోయిన యువతి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎవరో తన ఫోన్ నంబర్ సోషల్‌మీడియాలో పెట్టారని, దీంతో అనేక మంది తనకు ఫోన్ చేసి వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By April 15, 2020 at 11:28AM
No comments