Breaking News

ఇలాంటి హీరో దొరికాడేంటని బాధపడ్డా.. ఎన్టీఆర్‌పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్


లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ అన్నీ బంద్ చేసి ఇంట్లోనే ఉంటున్నారు . ఈ మేరకు ఓ మీడియా ఛానల్ ఆయనను ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్ సంగతులతో పాటు మూవీ ముచ్చట్లను కూడా పంచుకున్నారు జక్కన్న. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆయనపై సంచలన కామెంట్స్ చేశారు. నా సినిమాకు ఇలాంటి హీరో దొరికాడేంటని బాధపడ్డానని అన్నారు. ఎన్టీఆర్‌- రాజమౌళి సక్సెస్‌ఫుల్ కాంబో గురించి అందరికీ తెలిసిందే. ‘’ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం ఆ తరువాత ‘‘సింహాద్రి, యమదొంగ’’ సినిమాలతో విజయవంతంగా సాగింది. హాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న ఈ జోడీ నిజ జీవితంలోనూ ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం RRR (రౌద్రం రణం రుధిరం) మూవీని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జక్కన్న. ''తారక్‌తో స్టూడెంట్ నెం1 సినిమా చేస్తున్నప్పుడు ఆయన వయసు 19 సంవత్సరాలు. ఇంకా అతనికి మీసాలు కూడా రాలేదు. అప్పుడు ఎంతో లావుగా ఉండేవాడు. హెయిర్ స్టైల్ బాగుండేది కాదు. కనీసం పర్సనల్ గ్రూమింగ్ కూడా అతినికి తెలియదు. సో.. నా తొలి సినిమాకు ఇలాంటి హీరో దొరికాడేంటి అని చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఇంటర్వెల్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తుండగా తారక్ చెబుతున్న డైలాగ్స్, యాక్టింగ్ చూసి అతనిలో ఏదో ప్రత్యేకత ఉందని డిసైడ్ అయ్యాను'' అని జక్కన్న అన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌పై ఉన్న ఒపీనియన్ పూర్తిగా మారిపోయిందని రాజమౌళి చెప్పారు. తాను ఇప్పటిదాకా ఊహించింది తప్పు అని, జనాలను విపరీతంగా ఆకర్షించే టాలెంట్ ఈ కుర్రాడిలో ఉందని అప్పుడు తెలిసిందని ఆయన తెలిపారు. అది తనకెప్పటికీ గుర్తుండిపోయే విషయమని జక్కన్న పేర్కొన్నారు.


By April 19, 2020 at 01:09PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/s-s-rajamouli-shocking-comments-on-ntr-jr/articleshow/75231007.cms

No comments