Breaking News

వార్డులో నగ్నంగా తిరుగుతూ నర్సులకు వేధింపులు.. కరోనా రోగులపై కేసు


ఢిల్లీలోని నిజాముద్దీన్ గత నెలలో నిర్వహించిన మర్కజ్ సమావేశానికి హాజరై లక్షణాలతో ఐసోలేషన్‌లో చేరిన తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు నీచంగా ప్రవర్తిస్తున్నారు. తమకు కరోనా సోకిందన్న బాధ లేకుండా వైద్యసేవలు అందించే నర్సులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో వారిపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్ ఎంఎంజీ జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కొత్వాలీ ఘంటాఘర్ గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ హాస్పిటల్‌లోని చేరిన ఆరుగురు తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు ఐసోలేషన్ వార్డులో అర్ధనగ్నంగా తిరుగుతూ నర్సులను వేధిస్తున్నారని, వారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. Also Read: ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో చేరిన ఆరుగురు కరోనా రోగులు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఎంఎంజీ ఆసుపత్రి నర్సులు చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయగా, ఆయన తమకు సమాచారమిచ్చారని ఘజియాబాద్ ఎస్పీ తెలిపారు. తమకు సిగరెట్లు, బీడీలు కావాలని ఆరుగురు రోగులు డాక్టర్లు, నర్సులను డిమాండ్ చేస్తున్నారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, సమగ్ర దర్యాప్తు తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించని తబ్లిగ్ జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్‌తో పాటు ఏడుగురికి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. Also Read:


By April 03, 2020 at 07:08AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/ghaziabad-hospital-nurses-complain-of-misbehaviour-by-tablighi-jamaat-members-quarantined-for-coronavirus/articleshow/74958586.cms

No comments