Breaking News

లాక్‌డౌన్‌తో ఆర్థిక కష్టాలు: భార్య హత్య, చావుబతుకుల్లో భర్త


తమిళనాడులోని వేలూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను దారుణంగా చంపేసిన భర్త అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వేలూర్‌లోని జోలార్‌పేట సమీపం కుడియాన్‌కుప్పం రాగౌండర్‌ వీధికి చెందిన శంకర్‌ టైల్స్‌ అంటించే పనులు చేస్తుంటాడు. ఆయనకు భార్య విమల (29), మూడేళ్ల కుమార్తె ఉన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా కొద్దిరోజులుగా శంకర్‌ పనిలేకపోవడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. దీంతో దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. Also Read: ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి శంకర్, విమల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో శంకర్ ఆవేశంతో రాయితో భార్య తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అపస్మారక స్థితికి వెళ్లిపోవడంతో ఆందోళన పడి తాను కూడా అదే రాయితో తీవ్రంగా కొట్టుకున్నాడు. వారి పాప ఏడుస్తుండటంతో ఏం జరిగిందోనని అక్కడికి చేరుకున్న స్థానికులు భార్యభర్తలను రక్తపు మడుగులో చూసి షాకయ్యారు. Also Read: వారిద్దరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే విమల అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. శంకర్‌ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే శంకర్ కొద్దిరోజులు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో వారి మూడేళ్ల కూతురు అనాథగా మారడంతో స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. Also Read:


By April 30, 2020 at 08:59AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tamil-nadu-mand-kills-wife-before-try-to-suicide-over-financial-problems/articleshow/75463204.cms

No comments