Breaking News

ప్రియుడితో సెక్స్ చేస్తుండగా విసిగించాడని.. కన్నబిడ్డను చంపేసిన కిరాతకురాలు


కుటుంబం కంటే అక్రమ సంబంధమే ముఖ్యం అనుకున్న ఓ మహిళ నవమాసాలు కనిపెంచిన కన్నబిడ్డనే కడతేర్చిన ఘటన తమిళనాడులో జరిగింది. కోయంబత్తూరులోని కోవై కోవిల్‌ మేడు ప్రాంతంలో నివసిస్తున్న దివ్య(30)కు కొన్నాళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే మనస్పర్థల కారణంగా వారిద్దరూ కొద్దిరోజుల క్రితం విడిపోయారు. దీంతో దివ్య ఇద్దరు పిల్లలతో కలిసి తుడియలూరులో నివాసముంటోంది. Also Read: ఈ క్రమంలోనే దివ్యకు అదే ప్రాంతానికి చెందిన రాజదురై అనే యువకుడితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. వీరిద్దరు కలిసి 20 రోజుల క్రితం సాయిబాబా కాలనీకి మకాం మార్చి సహజీవనం చేస్తున్నారు. దివ్య ప్రియుడితో రాసలీలలు సాగించే సమయంలో కొడుకు అభిషేక్‌ను బయటకు పంపిస్తుండేది. మంగళవారం కూడా ఆమె ప్రియుడితో శారీరకంగా కలిసిన సమయంలో అభిషేక్ ఆకలి కోసం ఏడ్చాడు. దీంతో కోపం తెచ్చుకున్న దివ్య కొడుకును తీవ్రంగా హింసించింది. దీంతో చిన్నారి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. Also Read: దీంతో కంగారుపడిన దివ్య, రాజదురై బాలుడిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. 108 సిబ్బంది ఏం జరిగిందని అడగ్గా ప్రమాదంలో బాలుడు గాయపడ్డాడని వారు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన 108 సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దివ్య, రాజదురైని అదుపులోకి తీసుకుని విచారించగా తామే చంపేసినట్లు అంగీకరించారు. అభిషేక్ తనను తండ్రిగా అంగీకరించలేదన్న కోపంతోనే దివ్యతో కలిసి తాను హత్య చేసినట్లు రాజదురై పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దివ్య కుమార్తె(3) శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్రమ సంబంధం కోసం కన్నబిడ్డనే చంపిన దివ్యపై స్థానికులు మండిపడుతున్నారు. Also Read:


By April 22, 2020 at 10:17AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-kills-6-yr-old-son-with-help-of-lover-in-tamil-nadu/articleshow/75285808.cms

No comments