Breaking News

జీవితం అంతకంటే భయానకం.. రియల్ లైఫ్‌పై వర్మ షాకింగ్ కామెంట్స్


విషయం ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడటం, మనసులో ఉన్నది బయటపెట్టేయడం రామ్ గోపాల్ వర్మకు అలవాటు. ఎదుటి వాళ్ళు ఎవరు? ఎందుకలా ప్రశ్నించారు? అనేది పట్టించుకోకుండా తనకేదనిపిస్తే అదే నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు వర్మ. అందుకే ఆయనకు వివాదాస్పద వీరుడు అనే పేరొచ్చింది. ఎప్పుడూ ఏదో విషయమై వర్మ పేరు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఈ కరోనా కల్లోల సమయంలోనూ అందరికీ వర్మనే ఎంటర్‌టైనింగ్ పర్సన్ అయ్యారు. ఆన్‌లైన్ ఇంటర్వ్యూలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు కరోనా సంగతులపై స్పందిస్తున్నారు వర్మ. ఈ నేపథ్యంలోనే ఇటీవలే తన కలానికి పదునుపెట్టి 'కరోనా ఓ పురుగు' అంటూ పాట రాసి విడుదల చేశారు వర్మ. కరోనా గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూనే తనదైన స్టైల్ పంచులేస్తూ ఈ పాటను రూపొందించారు. దీంతో ఈ సాంగ్ నెట్టింట వైరల్ అయింది. ఈ క్రమంలో ప్రపంచ పుస్తక దినోత్సవం (ఏప్రిల్ 23) పురస్కరించుకొని ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం ట్విటర్‌ వేదికగా వర్మను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. దీనిపై వర్మ షాకింగ్ రిప్లై ఇచ్చి వార్తల్లో నిలిచారు. ''1988లో ఆర్జీవీ ఓ పుస్తకాల పురుగు అని నాకు తెలుసు, కానీ ఇప్పుడు మాత్రం ఆయన కరోనా పురుగు గురించి తెలుసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. సర్‌, ఇప్పటికీ మీరు స్టీఫెన్ హాకింగ్‌ పుస్తకాలు చదువుతున్నారా?'' అని కీరవాణి ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన వర్మ.. ''లేదు సర్.. ఆయన రచనలను చదవడం మానేశాను. ఆయన రాసిన కల్పిత కథల కంటే ఈ రియల్ లైఫ్ చాలా భయానకంగా ఉంది'' అన్నారు. ఇక్కడ కూడా తన విలక్షణత చాటుకొని తానేంటో మరోసారి చాటిచెప్పారు . Also Read:


By April 25, 2020 at 09:08AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-gopal-varma-shocking-comments-on-real-life/articleshow/75368273.cms

No comments