Breaking News

బాలకృష్ణ భారీ విరాళం.. ‘సిసిసి’‌కి చెక్ అందజేత


కరోనా క్రైసిస్‌తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆదుకునేందుకు ముందుకు వచ్చారు హిందుపురం ఎమ్మెల్యే, నటసింహం బాలకృష్ణ. కరోనాపై పోరాటానికి 1 కోటి 25 లక్షల రూపాయల భారీ విరాళం ప్రకటించి తన మంచి మనసు చాటుకున్నారు. అందులో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహయనిధికి, 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్థం 25 లక్షల రూపాయల చెక్‌ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి కళ్యాణ్‌కు అందించారు. ఈ సందర్భంగా స్వయం నిబంధనలతో ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని, కరోనాని అరికట్టడంలో అందరం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు బాలయ్య. ఇక తన సొంత నియోజక వర్గం హిందూపురంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తగు చర్యలు చేపట్టారు బాలయ్య. ఇటీవల హిందూపురం కూరగాయల మార్కెట్ దగ్గర ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, బాలయ్య అభిమానులు దాదాపు 3000 మందికి ఉచితంగా మాస్కుల పంపిణీ చేశారు. పేదలకు ప్రభుత్వం రేషన్ ఇస్తున్నందున.. ప్రజలకు కూరగాయాలు ఇవ్వాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నారు. హిందూపురంలో తన అనుచరుడు అంబికా లక్ష్మినారాయణకు కూరగాయల పంపిణీ బాధ్యతలు అప్పగించి.. నిత్యవసరస వస్తువైన కూరగాయల్ని అందిరికీ అందుబాటులో ఉంచుతున్నారు బాలయ్య.


By April 03, 2020 at 12:10PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hindupur-mla-nandamuri-balakrishna-donates-rs-1-crore-25-lakhs-to-fight-coronavirus-pandemic/articleshow/74962162.cms

No comments