అంతర్జాతీయంగా విమర్శలు.. వుహాన్‌లో మరణాలపై వాస్తవాలు వెల్లడించిన చైనా!
విషయంలో ముందు నుంచి చైనా ధోరణిపై అంతర్జాతీయ సమాజం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. గతేడాది డిసెంబరు తొలివారంలోనే వైరస్ వెలుగుచూసినా జనవరి వరకూ దాని గురించి బయట ప్రపంచానికి తెలియనీయకుండా జాగ్రత్త పడింది. అప్పటికే ఈ మహమ్మారి దేశాలను దాటి విస్తరించింది. కేసులు, మరణాల సంఖ్యపై కూడా చైనా పారదర్శకంగా వ్యవహరించడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా శుక్రవారం వెల్లడించిన గణాంకాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. తమ దేశంలో కరోనా వైరస్‌తో మొత్తం 4,632 మంది చనిపోయినట్టు ప్రకటించింది. వుహాన్ నగరంలో మరో 1,290 మంది కరోనా వైరస్‌తో చనిపోయినట్టు తెలిపింది. Read Also: కరోనా వైరస్ బాధితులు, మరణాల సంఖ్యను వుహాన్ మున్సిపల్ కార్పొరేషన్ సవరించినట్టు చైనా అధికారిక మీడియ జున్హూ తెలిపింది. ఏప్రిల్ 16 నాటి సవరించిన అంచనాల ప్రకారం.. వుహాన్‌లో కరోనా వైరస్ కేసులు 325 నుంచి 50,333కి చేరగా.. మరణాలు 1,290 నుంచి 3,869కి చేరాయి. సవరించిన లెక్కల ప్రకారం చైనా వ్యాప్తంగా కరోనా వైరస్‌తో 4,632 మంది ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 82,692కి చేరుకుంది. సంబంధిత చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా బాధితులు, మరణాలకు బాధ్యత వహించాలనే ఉద్దేశంతో ఈ సవరణలు జరిగినట్టు వుహాన్ మునిసిపల్ ప్రధాన కార్యాలయం తన నోటిఫికేషన్‌లో వెల్లడించింది. Read Also: కరోనా వైరస్ విషయంలో చైనా వెల్లడించిన సమాచారం, వివరాలపై అమెరికా సహా ఇతర దేశాలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో డ్రాగన్ ఈ సవరణలు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. తన సవరణలపై వుహాన్ మున్సిపల్ కార్పొరేషన్ వివరణ ఇచ్చింది. కరోనా వైరస్ సమాచారం విషయంలో పారదర్శకంగా ఉన్నామని, వివరాలు ఖచ్చితమైనవని తెలిపింది. ముందు వెల్లడించిన వివరాలకు.. ప్రస్తుత డేటా వ్యత్యాసానికి గల కారణాలను కూడా తెలిపింది. వైరస్ ప్రారంభ దశలో రోగుల సంఖ్య, పెరుగుతున్న వైద్య వనరులు, వైద్య సంస్థల ప్రవేశ సామర్థ్యాన్ని తెలిపింది. కొంతమంది హాస్పిటల్స్‌లో చికిత్స తీసుకోకుండా ఇళ్లలోనే చనిపోయారని తెలిపింది. Read Also: ఆసుపత్రులు సామర్థ్యానికి మించి పనిచేశాయని, వైద్య సిబ్బంది రోగులను రక్షించడం, చికిత్స చేయడంలో మునిగిపోయారు.. తత్ఫలితంగా మరణాలు, కేసుల సంఖ్య లెక్కింపులో జాప్యం జరిగిందని పేర్కొంది. అలాగే, బాధితులకు చికిత్స అందజేసిన హాస్పిటల్స్ మధ్య అనుసంధానం లేకపోవడంతో వివరాలు అందలేదని వ్యాఖ్యానించింది. అంతేకాదు, కరోనా సంబంధిత సమాచారం,అంటువ్యాధిపై విచారణకు మార్చిలోనే ఓ కమిటీని వేశామని వివరించింది. ఈ కమిటీ వివిధ వర్గాలు, ఆన్‌లైన్ ద్వారా సమాచారం సేకరించి నివేదికను రూపొందించిందని తెలిపింది. Read Also: .. అయితే, సవరించిన వివరాలను మాత్రం చైనా ఆరోగ్య కమిషన్ వెల్లడించే రోజువారీ నివేదికలో మాత్రం పొందుపరచకపోవడం గమనార్హం. చైనాలో ఇప్పటి వరకూ కరోనాతో 3,342 మంది చనిపోయారని, 82,367 మంది వైరస్ బారినపడినట్టు పేర్కొంది. మొత్తం 77,944 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారని, 1,081 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని తెలిపింది. కొత్తగా గురువారం 26 కేసులు నమోదు కాగా.. వీరిలో 15 మంది విదేశాల నుంచి వచ్చినవారేనని తెలియజేసింది. 11 మంది స్థానికులు వైరస్ కొత్తగా సోకింది.
By April 17, 2020 at 11:53AM
No comments