కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య.. అనాథలైన ఇద్దరు పిల్లలు

కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో మంగళవారం జరిగింది. బాచుపల్లి పీఎస్ పరిధిలోని నిజాంపేట శ్రీనివాస కాలనీకి చెందిన పి.సురేందర్(42) ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్య బిందు(36), ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. లాక్‌డౌన్ కారణంగా సురేందర్ కొద్దిరోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే రెండు మూడు రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. Also Read: మంగళవారం సురేందర్ భార్యతో మళ్లీ గొడవపడ్డాడు. దీంతో మనస్తాపానికి గురైన ఇద్దరూ సాయంత్రం వేళ బెడ్రూమ్‌లోకి వెళ్లి ఉరేసుకున్నారు. తల్లిదండ్రులు ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో ఇద్దరు పిల్లలు తలుపు తట్టినా ఫలితం లేకపోయింది. పిల్లల అరుపులు విన్న పైఅంతస్తులో ఉండే సురేందర్ సోదరుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి చేరుకుని తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. దీంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రుల ఆత్మహత్యతో పిల్లలిద్దరూ అనాథలయ్యారని బంధువులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Also Read:
By April 15, 2020 at 10:10AM
No comments