Breaking News

ఆరోగ్య సేత యాప్‌తో తస్మాత్ జాగ్రత్త.. సైనికులకు ఆర్మీ హెచ్చరిక


నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు మొబైల్ యాప్ వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైనికులకు ఆర్మీ హెచ్చరించింది. విషయంలో సైనికులు, వారి కుటుంబాలు, మాజీ సైనికులు భద్రత ఉల్లంఘన జరగకుండా సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్‌లను అనుసరించాలని సూచించింది. కేంద్రం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్ ద్వారా ఒకవేళ మన సమీపంలో ఎవరైనా కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులు ఉంటే సమాచారం తెలుస్తుంది. ఎవరిలోనైనా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నా, అసలు అవి ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. పది రోజుల కిందట అమల్లోకి వచ్చిన ఈ యాప్‌ను ఇప్పటికే కోటి మందికి పైగా డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఎవరికైనా కరోనా పాజిటివ్ ఉంటే... వారికి సన్నిహితంగా ఉండే వారికి కూడా సోకితే... ఈ యాప్ ద్వారా... ఇంకా ఎంత మందికి ఆ వైరస్ సోకే అవకాశం ఉందో తెలుసుకోవచ్చు. మీరు ఎవరెవరిని కలిశారో, ఏయే ప్రాంతాలకు వెళ్లారో ఈ యాప్ సూచిస్తుంది. తద్వారా ఇంకా ఎవరెవరికి కరోనా సోకే అవకాశం ఉంటుందో గుర్తించడం తేలికవుతుంది. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత... బ్లూటూత్ ఆన్ చెయ్యాల్సి ఉంటుంది. (ఇది ఎప్పుడూ ఆన్ చేసే ఉంచాలి). అలాగే లొకేషన్ కూడా ఆన్ చెయ్యాల్సి ఉంది. దీని వల్ల మీరు ఏయే ప్రాంతాలకు వెళ్లారో ఈ యాప్ గుర్తిస్తుంది. యాప్ లోకేషన్ ఆన్‌చేసి ఉండటం వల్ల శత్రువులకు మన కదలికలు సులువుగా తెలుస్తుంది. కాబట్టి సైనికులు ఈ యాప్‌ను కార్యాలయాలు, విధులు నిర్వహించే ప్రాంతాలు, ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో వాడరాదని సూచించింది. కరోనా వైరస్ కట్టడి కార్యకలాపాల్లో భాగంగా కంటోన్మెంట్స్, మిలటరీ స్టేషన్ల నుంచి పబ్లిక్ ప్రదేశాలు, ఐసోలేషన్ సెంటర్లకు వెళ్లేటప్పుడు మాత్రమే బ్లూటూత్, లొకేషన్ ఆన్ చేయాలని స్పష్టం చేసింది. అలాగే, ర్యాంకు, సర్వీస్ గుర్తింపు సహా తమ వ్యక్తిగత విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ యాప్‌ను వినియోగిస్తున్న సైనికులు వెల్లడించరాదని, అలాగే ఎప్పటికప్పుడు మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయాలని సూచించింది. సాధారణంగా ముఖ్యమైన కార్యాచరణ ప్రాంతాలు, సున్నితమైన ప్రదేశాలలో కీలకమైన విధులు నిర్వహించే అధికారులు, నిఘా వర్గాలు స్మార్ట్ ఫోన్‌లు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు.


By April 17, 2020 at 10:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-army-advises-personnel-to-use-aarogya-setu-app-but-with-usual-cyber-precautions/articleshow/75193325.cms

No comments