దొంగ నా కొడుకు! రవితేజ షాకింగ్ పోస్ట్.. అతనిపై కన్నేశానన్న మాస్ మహారాజ్
మాస్ మహారాజ్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సాధారణంగా సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషించని రవితేజ.. ఈ లాక్‌డౌన్ సమయంలో మాత్రం చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు తన హోమ్ క్వారంటైన్ విశేషాలు తెలుపుతూ అభిమానులను పలకరిస్తున్నారు. ఎప్పుడూ ఫ్యామిలీని చూపించని ఆయన తన కొడుకు, కూతురులను పరిచయం చేస్తూ ఈ హోమ్ క్వారంటైన్ సమయం ప్రతిరోజు సండేలా గడిచిపోతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో పోస్ట్ పెట్టిన రవితేజ అందరి దృష్టినీ లాగేశారు. తన కొడుకు మహాధన్‌తో ఇంట్లో సరదాగా గడుపుతున్న క్షణాన్ని కెమెరాలో బంధించి ఆ పిక్ షేర్ చేశారు. దీనిపై 'డీఎన్‌కె' అని ఆయన కామెంట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇద్దరూ బెడ్‌పై పక్కపక్కనే కూర్చొని అలా రిలాక్స్ అవుతూ సెల్ ఫోన్స్ చూస్తున్న ఫోటో ఇది. దీనిపై ''చెకింగ్ ఆన్ మై డీఎన్‌కె'' అని ట్యాగ్ చేయడంతో ఆ 'డీఎన్‌కె' అంటే ఏంటో విశ్లేషించే పనిలో పడ్డారు నెటిజన్స్. తన కొడుకు ముద్దుగా దొంగ నా కొడుకు! అంటున్నారని పేర్కొంటూ రిప్లై పెడుతున్నారు. మొత్తానికైతే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవలే ‘డిస్కోరాజా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి కాస్త నిరాశ చెందిన రవితేజ ప్రస్తుతం ‘’ సినిమా చేస్తున్నారు. విలక్షణ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. లాక్‌డౌన్ ఫినిష్ కాగానే ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. Also Read:
By April 27, 2020 at 12:00PM
No comments