నిజామాబాద్ జిల్లాలో కలకలం.. ఏపీ యువతి దారుణహత్య.. దహనం!
నిజామాబాద్ జిల్లాలో మహిళను హత్య చేసి దహనం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మాక్లూర్ మండలం రాంచంద్రపల్లి అటవీ ప్రాంతంలో శనివారం ఓ మహిళ దహనమై కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. మృతురాలు నవీపేట మండలం శివతండాకు చెందిన వివాహితగా అనుమానిస్తూ ఆమె భర్త, అత్తను అదుపులోకి తీసుకున్నారు. Also Read: గ్రామస్థుల కథనం ప్రకారం... శివతండాకు చెందిన యువకుడు హైదరాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో పని చేస్తున్నాడు. అక్కడ పరిచయమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అర్ధవీడు మండలానికి చెందిన యువతిని ఆరు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో భార్యాభర్తలు తండాకు వచ్చి ఉంటున్నారు. మూడు రోజులుగా భర్త, అత్త కలిసి ఆమెను వేధిస్తున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమెను బంధువుల ఇంటికి వెళ్దామని చెప్పి భర్త బైక్‌పై తీసుకెళ్లాడు. Also Read: శనివారం ఉదయం తండాలోని యువకుడి ఇంటి బయట ఆమె చెప్పులు, దుస్తులు కాల్చివేస్తుండటం, ఇంట్లో భార్య కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు నిలదీశారు. యువతిని తామే హత్య చేసినట్లు భర్త, అత్త చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిద్దరిన అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అదే సమయంలో రాంచంద్రపల్లి ఫారెస్ట్ ఏరియాలో మహిళ హత్యోదంతం వెలుగుచూడటంతో నిందితులను మాక్లూర్ పోలీసులకు అప్పగించారు. అయితే అక్కడ దహనం చేసింది శివతండాకు చెందిన మహిళనేనా కాదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు చెబుతున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే పూర్తి వివరాలు తెలుస్తామని పోలీసులు పేర్కొన్నారు. Also Read:
By April 26, 2020 at 07:21AM
No comments