పిజ్జా డెలివరీ బాయ్‌కు కరోనా.... క్వారంటైన్‌కు 72 కుటుంబాలు
కరోనా వైరస్ భారత్‌లో నెమ్మదిగా విజృంభిస్తోంది. వందల్లో ఉన్న కేసుల సంఖ్య వేలకు చేరింది. పదుల్లో ఉన్న మరణాలు వందకు చేరాయి. దీంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. పేద ధనిక, చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ఎలాంటి వయస్సు ఉన్నవాళ్లైనా సరే ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా పాజిటివ్ అని తేలింది. దీంతో అతడు డెలివరీ చేసిన 72 ఫ్యామిలీలను క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాల్వియా ప్రాంతంలో ఓ పిజ్జా సంస్థలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా సోకినట్టు అధికారులు నిర్ధారించారు. అతడిలో కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ ప్రతిరోజు పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లాడు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండటంతో అతడికి ఇటీవలే కరోనా పరీక్షలు నిర్వహించారు. టెస్టుల్లో కు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం.. పిజ్జా బాయ్‌ను కొవిడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడితో పాటు పనిచేసిన మరో 16 మంది డెలివరీ బాయ్స్‌ను కూడా క్వారంటైన్‌కు తరలించారు. బాధితుడు ఫుడ్ డెలివరీ చేసిన ఇళ్ల వివరాలను అధికారులు సేకరించారు. దాదాపు 72 ఫ్యామిలీలను గుర్తించి వారిని సైతం సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు. పిజ్జా డెలివరీ చేసిన బాధితుడు తన ముఖానికి మాస్క్ ధరించి ఉన్నాడని, అతడితో పాటు ఇతర పిజ్జా డెలివరీ బాయ్స్ కూడా తమ ముఖాలకు మాస్క్ లు ధరించి ఫుడ్ డెలివరీ చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. మాస్క్ లు ధరించి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నందున ఫుడ్ ఆర్డర్ చేసినవాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచనలు చేస్తున్నారు.
By April 16, 2020 at 11:31AM
No comments