Breaking News

మే చివరినాటికి ఒక్క ముంబయిలోనే 70వేల మందికి కరోనా.. సర్వే


దేశంలో కేసుల సంఖ్య 23వేలు దాటగా.. గురువారం ఒక్క రోజే 1,755 కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారంతో పోల్చితే గురువారం కేసుల పెరుగుదల రేటు 8.2 శాతంగా ఉంది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లోనే ఆ రాష్ట్రంలో 778 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. ముంబయి నగరంలోనే దాదాపు 500 మందికి వైరస్ సోకింది. దీంతో ముంబయిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,200కి చేరింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఒక్క ముంబయిలోనే మే నెల చివరి నాటికి 70వేల మంది వైరస్ బారినపడతారని అంచనా వేస్తున్నారు. మే నెల నాటికి తీవ్రమైన లక్షణాలున్న కరోనా వైరస్ బాధితుల కోసం అదనంగా కనీసం 3,000 కోవిడ్-కేర్ బెడ్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలను బీఎంసీ ముమ్మరం చేసింది. అయితే, ఇవి కేసులు పెరిగే సంఖ్యలో 5 శాతం మాత్రమే. వీటితోపాటు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జీటీ హాస్పిటల్, సెయింట్ జార్జ్ హాస్పిటల్స్‌ను కూడా బీఎంసీ స్వాధీనం చేసుకోవాలని భావిస్తోంది. ఈ రెండు హాస్పిటల్స్‌లో 600 వరకు బెడ్స్ అందుబాటులో ఉన్నాయి... కరోనా బాధితులకు చికిత్స అందజేసే హాస్పిటల్స్‌ను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం వల్ల మహమ్మారిని మరింత సమర్ధంగా నియంత్రించడానికి అవకాశం ఉంటుందని బీఎంసీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హాస్పిటల్స్‌లో ఆక్సిజన్, వెంటిలేటర్ సదుపాయాలను కల్పించాలని పేర్కొన్నారు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారవీలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ అక్కడ 250 మందికిపైగా వైరస్ బారినపడ్డారు. ఇక్కడ వైరస్ విజృంభించకుండా చర్యలు చేపట్టినా కొత్త కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి మే మధ్యనాటికి తీవ్రరూపం దాల్చుతుందని, తర్వాత క్రమంగా తగ్గుతుందని ఓ సర్వే వెల్లడించిన విషయం తెలిసిందే. గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ప్రోటివిటీతో కలిసి టైమ్స్ నెట్‌వర్క్‌ ఈ సర్వేను నిర్వహించింది. ‘టైమ్స్ ఫ్యాక్ట్ ఇండియా ఔట్‌బ్రేక్ రిపోర్ట్’పేరుతో నివేదికను రూపొందించి మూడు వేర్వేరు అంశాలనుల పరిగణలోకి తీసుకుంది. సుమారు మే 22న నాటికి దేశంలో 75,000పైగా కరోనా వైరస్ కేసులు నమోదవుతాయని తెలిపింది. కరోనావైరస్ పురోగతిని అంచనా వేయడానికి ఈ బృందం మూడు నమూనాలను అనుసరించింది. వివిధ పరిస్థితులలో వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది.. సంక్షోభాన్ని ప్రభుత్వం ఎదుర్కొంటోంది.. ఆరోగ్య మౌలిక సదుపాయాలు ఎలా స్పందిస్తున్నాయనేది ప్రతి నమూనా ద్వారా తెలుసుకుంటున్నారు. పర్సంటేజ్ మోడల్, ది టైమ్ సీరిస్ మోడల్, సస్పెక్టబుల్ ఎక్స్‌పోజ్డ్ ఇన్‌ఫెక్టెడ్ రికవర్డ్ (సెరి) మోడల్.


By April 24, 2020 at 10:39AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-mumbai-can-see-70000-positive-cases-by-may-end-says-mathematical-study/articleshow/75341763.cms

No comments