కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: హైదరాబాద్‌లో కరోనా కలకలం.. తెలంగాణలోని 50 శాతం కేసులు ఇక్కడే

⍟ ప్రపంచంలోని అన్ని అదేశాలు కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. దావానంలా వ్యాపించిన ఈ మహమ్మారి సమస్త భూ మండలాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది. రోజు రోజూ విజృంభిస్తూ వేలాది మందిని బలితీసుకుంటోంది. అగ్రరాజ్యాలు సైతం మహమ్మారి ప్రభావంతో అతలాకుతలమవుతున్నాయి. అమెరికాలో వైరస్ తీవ్రత మాములుగా లేదు. రోజు రోజుకూ కొత్త కేసులు వేలల్లోనే నిర్ధారణ అవుతుండగా.. మృతుల సంఖ్య కూడా భారీగా ఉంది. ⍟దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విశ్వరూపం దాల్చుతోంది. తబ్లీగ్ జమాత్ ప్రకంపనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ రెండో దశ దాటి సామూహిక వ్యాప్తి దిశగా సాగుతోంది. శుక్రవారం ఏకంగా 600కిపైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఇవే అత్యధికం. అలాగే దేశవ్యాప్తంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ కేసులు దేశంలో వెలుగుచూసిన తర్వాత ఒక్క రోజులో ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. పూర్తి కథనం.. ⍟ ముంబై విమానాశ్రయంలో విధులు నిర్వర్తించిన 11 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లు కరోనా బారిన పడ్డారు. విమానాల రాకపోకలపై నిషేధం విధించక ముందు ముంబై విమానాశ్రయానికి వివిధ దేశాల నుంచి భారీగా రాకపోకలు సాగించారు. దీంతో ముందు జాగ్రత్తగా 142 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లను గత కొద్ది రోజులుగా క్వారంటైన్లో ఉంచారు. ⍟ లాక్‌డౌన్ ప్రభావంతో దేశ ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి.. ఒక వేళ వచ్చినా నిత్యావసరాలు తీసుకొని కాసేపట్లోనే తిరిగి వెళ్లాల్సి వస్తోంది. లాక్‌డౌన్ ప్రభావంతో కోట్లాది మంది ఆదాయాన్ని కోల్పోయారు. ఖజానా ఖాళీ కావడంతో ప్రభుత్వాలు కూడా జీతాల్లో కోత పెడుతున్నాయి.ఇవన్నీ లాక్‌డౌన్ సమస్యకు ఓవైపే. వీటన్నింటి కంటే ఎక్కువ మందుబాబుల కష్టాలు . ⍟ నిజామాబాద్ జిల్లాలో ఒక్కరోజే కొత్తగా 16 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా పరీక్షల కోసం గురువారం పంపిన 42 నమూనాల్లో 41 మందికి సంబంధించిన ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. ⍟ కరోనా మహమ్మారి కాటుతో హైదరాబాద్ శివారుకు చెందిన ఓ గ్రామీణ మహిళ మృత్యువాత పడింది. అయితే, ఈ వ్యవహారం అధికారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలం కోడూరు గ్రామానికి చెందిన భారతమ్మ(55) ఆకస్మికంగా చనిపోవడంతో పెద్ద దుమారం రేగుతోంది. . ⍟ తెలంగాణలో కరోనా వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 11కి చేరింది. శుక్రవారమే కరోనా వల్ల ఇద్దరు చనిపోయారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, సికింద్రాబాద్ గాంధీలో ఒక్కరు చొప్పున మరణించారు. రంగారెడ్డి జిల్లాలోని నందిగామ మండలం, చేగూర్ గ్రామంలో నివసించే భారతమ్మ(50) అనే మహిళ ఆరోగ్యం బాగలేకపోవడంతో గత మూడు రోజుల క్రితం ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. ⍟హైదరాబాద్ నగర పరిధిలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఏప్రిల్ 2 వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్యను పరిశీలిస్తే.. దాదాపు 50 శాతం కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. హైదరాబాద్ , రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 76 కేసులు గుర్తించారు. ఆ తర్వాత అత్యధిక కేసులు వరంగల్ అర్బన్, కరీంనగర్ జిల్లాల్లో నమోదయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు గాను ఇప్పటి వరకూ 20 జిల్లాల్లో కరోనా వైరస్ బాధితులున్నట్లు నిర్ధారణ అయ్యింది. ⍟ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పటిష్టంగా అమలవుతోంది. అకారణంగా ఎవరైనా రోడ్లపైకి వస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని కోరుతున్నారు. ఇక ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు కూడా లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేయొద్దని ప్రజలకు వివరిస్తున్నారు. కానీ లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని ప్రజలకు చెప్పాల్సిన ఓ ఎమ్మెల్యే బ్రేక్ చేశారు. ⍟ ఏపీలో కరోనా వైరస్ (కోవిడ్ 19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు 161గా కేసులు రాత్రికి మరో మూడు పెరిగి 164కు చేరుకున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుల్లో కూడా ఎక్కువ ఢిల్లీ ప్రార్థనకు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. ⍟ ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌కు వెళ్లిన వారిలో ఇంకా కొందరి ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎంతమంది దొరకలేదన్న విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. తెలంగాణ నుంచి మొత్తం 1,030 మంది ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి వెళ్లి రాగా వారిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 603 మంది, మిగతా జిల్లాలకు చెందిన వారు 427 మంది ఉన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రం మిగిలిపోయిన వారి కోసం గాలింపు జరుగుతూనే ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇంకా ఆచూకీ దొరకని వారు పదుల సంఖ్యలోనే ఉంటారని తెలుస్తోంది.
By April 04, 2020 at 08:50AM
No comments