Breaking News

మంగళగిరిలో వ్యభిచారం గుట్టురట్టు.. ఇద్దరు సెక్స్‌వర్కర్లు, విటుడు అరెస్ట్


జిల్లా మండలంలో గుట్టుగా కొనసాగుతున్న వ్యభిచార దందాను పోలీసులు రట్టు చేశారు. చినకాకాని గ్రామ పంచాయతీ పరిధిలోని రాజ్‌కమల్‌ రోడ్డులో ఇద్దరు మహిళలు కొంత కాలంగా ఓ ఇల్లును అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వారింటికి తరుచూ అపరిచిత వ్యక్తులు వస్తుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై నిఘా పెట్టిన మంగళగిరి రూరల్ సీఐ పి.శేషగిరిరావు మంగళవారం సిబ్బందితో కలిసి రైడ్ నిర్వహించారు. Also Read: ఈ సందర్భంగా వ్యభిచారం నిర్వహిస్తోన్న ఇద్దరు మహిళలతో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4వేల నగదు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు మహిళలు తాము వ్యభిచారం చేయడంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఆ కూపంలోకి లాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సెక్స్ రాకెట్ వెనుక ఎవరెరున్నారో తెలుసుకునేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. Also Read:


By March 11, 2020 at 09:26AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/sex-racket-busted-in-mangalagiri-two-women-arrested/articleshow/74569574.cms

No comments