పదేళ్ల బాలికపై అర్ధరాత్రి అఘాయిత్యం... భవనంపై నుంచి తోసి హత్య

తమిళనాడులో దారుణ ఘటన వెలుగుచూసింది. పదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించిన ఓ యువకుడు ఆమె కేకలు వేయడంతో ఆగ్రహించి బిల్డింగ్ పైనుంచి తోసి చంపేశాడు. ఈ ఘటన చెన్నైలోని మదురవాయల్‌లో శనివారం జరిగింది. మదురవాయల్ సమీప ప్రాంతంలో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన దంపతులు నివసిస్తున్నారు. వీరికి పదేళ్ల కుమార్తె ఉంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. Also Read: శుక్రవారం రాత్రి సుమారు 11.30 గంటల ప్రాంతంలో బయట ఉన్న బాత్రూమ్‌కి వెళ్లిన బాలిక చాలాసేపటి వరకు తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టి ఇంటి వెనకవైపు తీవ్ర రక్తస్రావంతో పడివున్న బాలికను గుర్తించారు. ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో ఆమెను వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు కోల్పోయింది. Also Read: ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు కనుగొన్నారు. బాలిక ఉంటున్న ఇంటిపై అంతస్తులో ఉన్న భవననిర్మాణ కార్మికుడు సురేశ్(29) ఆమెను లైంగికంగా వేధిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఉన్న సురేశ్ బాత్రూమ్‌కి వచ్చిన బాలికను పైకి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. ఆమె కేకలు వేయడంతో ఆగ్రహించిన సురేశ్ బాలికను భవనం నుంచి కిందికి తోసేశాడని తెలిసింది. సురేశ్‌ని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. Also Read:
By March 22, 2020 at 08:32AM
No comments