Breaking News

వెల్‌కమ్ మామయ్య... చిరుకు స్వాగతం పలికిన ఉపాసన


ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ఫస్ట్ ట్వీట్‌ను చేశారు. ఉగాది సందర్భంగా తన అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి మనమంతా కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఇంటిపట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం అని పిలుపునిచ్చారు చిరు. చిరు సోషల్ మీడియాలోకి వచ్చిన సందర్భంగా ఆయన కోడలు, సతీమణి ట్వీట్ చేశారు. ‘వెల్ కమ్ మామయ్య’ అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.ఈ సందర్బంగా ఉగాది శుభాకాంక్షలు కూడా తెలిపారు. చిరు సోషల్ మీడియాలో కూడా తన సత్తా చాటారు. ఇలా వచ్చారో లేదో ఆయనకు లక్షల్లో ఫాలోవర్స్ వచ్చారు. ఇంతవరకు సామాజిక సైట్లలోకి రాని చిరు... నిన్న తాను సోషల్ మీడియాలోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. ప్పటికప్పుడు తన భావాల్ని అభిమానులతో షేర్ చేసుకుంటానన్నారు. తాను అనుకున్న మెసేజ్‌లు, చెప్పాలనుకున్నవాటిని ప్రజలతో చెప్పుకోవడానికి సోషల్ మీడియానే వేదిక అన్నారు. అందుకే ఈ ఉగాది రోజు నుంచి తాను సోషల్ మీడియాలోకి వస్తానన్నారు.


By March 25, 2020 at 11:52AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/upasana-welcome-chiranjeevi-on-social-media/articleshow/74805518.cms

No comments