ప్రేమన్నాడు.. పెళ్లికి ముందే తల్లిని చేశాడు... నెల్లూరు యువకుడిపై కేసు

ప్రేమ పేరుతో యువతిని లొంగదీసుకుని గర్భవతిని చేసిన యువకుడిపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామానికి చెందిన యువతి విజయవాడ సూర్యారావుపేటలోని ఓ ఓల్డేజ్ హోమ్‌లో పనిచేస్తోంది. ఏడాది కిందట ఓ వృద్ధురాలికి సేవలందించే నిమిత్తం ఓల్డేజ్ హోమ్ నిర్వాహకులు ఆమెను నగరానికి పంపించారు. Also Read: అక్కడ షేక్ షఫీ అనే వ్యక్తి ఆమెకు పరిచయమై కొంతకాలానికి దగ్గరయ్యాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెంట తిరిగాడు. మూడు నెలల తర్వాత ఆమె విజయవాడ వచ్చేయగా.. షఫీ తరచు విజయవాడ వచ్చి ఓ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకుని ఆమెతో గడిపేవాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చడంతో ప్రియుడికి ఫోన్ చేసి చెప్పింది. త్వరలోనే పెళ్లి చేసుకుందామని చెప్పి షఫీ తర్వాత ఫోన్ లిఫ్ట్ మానేశాడు. Also Read: ప్రియుడి ఎడబాటుతో మనస్తాపానికి గురైన యువతి ఫిబ్రవరి 14న విజయవాడ బస్‌స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించిన పోలీసులు దిశ వన్‌స్టాప్ సెంటర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో వారు యువతి వివరాలు సేకరించి గూడవల్లిలోని రెస్య్యూ హోమ్‌కు తరలించారు. అక్కడే 27వ తేదీన ఆమెకు ఫిట్స్ రావడంతో నిర్వాహకులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాధితురాలు మృత శిశువును ప్రసవించింది. అవుట్‌పోస్ట్ పోలీసులు ద్వారా వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షఫీ ఆచూకీ కోసం నెల్లూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. Also Read:
By March 03, 2020 at 11:27AM
No comments