ప్రాణం తీసిన ఈత సరదా.. తమిళనాడులో కవలలు మృతి

తమిళనాడులోని ఆవడిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కృష్ణా కాలువలో స్నానానికి వెళ్లిన కవల సోదరులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. తిరునిండ్రవూర్‌లోని ప్రకాశ్‌నగర్ టవర్ వీధికి చెందిన మోహన్ దంపతులకు జస్టిన్ (13), జబస్టీన్ (13) అనే కవల పిల్లలున్నారు. వీరు స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. కరోనా వైరస్ కారణంగా కొద్దిరోజుల క్రితమే స్కూల్‌కి సెలవులు ఇవ్వడంతో ఇంటి వద్దనే ఉంటున్నారు. Also Read: మంగళవారం స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి మిట్టనమల్లి కండిగైలోని కృష్ణా కాలువకు ఇద్దరూ వెళ్లారు. స్నానం చేయడానికి కాలువలోకి దిగిన కవలలు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినా వారి ఆచూకీ తెలియలేదు. బుధవారం ఉదయం ముత్తాపుదుపేట్టై సమీపాన కృష్ణా కాలువలో ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కీళ్పాక్కంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు కొడుకులు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. Also Read:
By March 26, 2020 at 10:03AM
No comments