Breaking News

లిఫ్ట్ ఇస్టానని నమ్మించి వివాహితపై రేప్.. తూ.గో. జిల్లాలో దారుణం


అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు లిఫ్ట్ ఇస్తానని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా మండలంలో సోమవారం జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత(40) సోమవారం కడుపునొప్పితో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రికి ఒంటరిగా వెళ్లింది. చికిత్స అనంతరం ఇంటికెళ్లేందుకు ఆటో కోసం ఎదురుచూస్తోంది. Also Read: అదే సమయంలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి ఆమెను గమనించి వివరాలు తెలుసుకున్నాడు. తాను కూడా అదే గ్రామానికి వెళ్తున్నానని, ఇంటి దగ్గర దించుతానని నమ్మించి బైక్ ఎక్కించుకున్నాడు. కాసేపటి తర్వాత దారి మళ్లించి పామాయిల్‌ తోటలోకి తీసుకెళ్లాడు. తనకు సహకరించకపోతే చంపేస్తానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. కాసేపటి తర్వాత మరోసారి అత్యాచారానికి యత్నించడంతో బాధితురాలు కేకలు వేసుకుంటూ రోడ్డుపైకి వచ్చి పరుగు పెట్టింది. Also Read: అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఆమెను గమనించి ఆపాడు. దూరంగా నుంచి అతడిని గమనించిన నిందితుడి అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలు గ్రామానికి చేరుకుని సచివాలయ ఉద్యోగికి సమాచారమివ్వగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పెద్దాపురం సీఐ కె.ఎన్‌.వి.జయకుమార్‌, ఎస్ఐ సి.హెచ్‌.సుధాకర్‌ గ్రామానికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు చేపట్టారు. Also Read:


By March 18, 2020 at 09:31AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-raped-by-unindetified-woman-in-east-godavari-district/articleshow/74684103.cms

No comments