పొదల మధ్య కాలిన స్థితిలో దంపతుల శవాలు.. రాజమండ్రిలో కలకలం

రాజమహేంద్రవరంలో కలకలం రేగింది. నగరంలోని ప్రకాశ్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భార్యభర్తలు అనుమానాస్పద స్థితిలో శవాలై కనిపించారు. చెట్ల పొదల్లో సగం కాలిన దంపతుల మృతదేహాలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Also Read: సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు వారి వివరాలు సేకరిస్తున్నారు. వీరు స్థానికులా? లేక ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు వీలైనంత త్వరగా చేధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. చెట్ల పొదల్లో రెండు మృతదేహాలను కాలిన స్థితిలో చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. Also Read:
By March 27, 2020 at 11:22AM
No comments