Breaking News

కరోనా భయంతో బహ్రెయిన్‌లో ఆత్మహత్య.. రాజమండ్రి వాసి విషాదగాథ


కరోనా భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాదం నింపింది. బతుకుదెరువు కోసం బ్రహెయిన్ వెళ్లిన అతడు కరోనా ప్రభావంతో అక్కడే చిక్కుకుపోయాడు. ఆ దేశంలో ఉపాధి లేక స్వస్థలానికి వచ్చే అవకాశం లేక తీవ్ర మనోవేదనకు గురై ప్రాణాలు తీసుకున్నాడు. Also Read: గొల్లవీధికి చెందిన వర్ధనపు మహేశ్‌(23) ఉపాధి కోసం ఇద్దరు స్నేహితులతో కలిసి గతేడాది బ్రహెయిన్ దేశానికి వెళ్లాడు. కరోనా కారణంగా అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఇంటికి వచ్చేస్తున్నానని కొద్దిరోజుల క్రితం కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. కాంట్రాక్ట్ పూర్తి కాకుండా వచ్చేస్తే జీతం ఇవ్వరని, కొంత మొత్తాన్ని వాళ్లకే కట్టాల్సి వస్తుందని డబ్బులు పంపించాలని కోరాడు. Also Read: అయితే అక్క రత్నం తాను విమాన టిక్కెట్‌కి డబ్బులు సమకూరుస్తానని, మిగిలిన డబ్బులు ఎలాగోలా సర్దుబాటు చేసుకుని త్వరగా ఇంటికి వచ్చేయాలని కోరింది. అయితే తన ఫోన్ అమ్మేసి డబ్బులు కట్టేసి వచ్చేస్తానని మహేశ్‌ చెప్పాడు. వారం రోజుల క్రితం ఫోన్ చేసి ఈ నెల 22న బయలుదేరేందుకు ఫ్లైట్ టిక్కెట్ తీసుకున్నానని చెప్పడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే 23వ తేదీన ఇండియన్ ఎంబసీ నుంచి మహేశ్ కుటుంబసభ్యులకు ఫోన్ వచ్చింది. అతడు గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడంతో అందరూ షాకయ్యరు. ప్రస్తుత పరిస్థితుల్లో మృతదేహాన్ని కూడా స్వస్థలానికి పంపించలేమని వారు చెప్పడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. కొద్దిరోజుల్లో బిడ్డ ఇంటికి వచ్చేస్తాడని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు అతడు ఆత్మహత్య చేసుకున్నాడన్న సంగతి తెలిసి తట్టుకోలేకపోతున్నారు. చివరికి కన్నబిడ్డను ఆఖరిసారి కూడా చూసుకునే అవకాశం కూడా లేకపోవడంతో వారి బాధ వర్ణణాతీతంగా మారింది. Also Read:


By March 25, 2020 at 10:57AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/rajahmundry-man-commits-suicide-in-bahrain/articleshow/74804622.cms

No comments