Breaking News

‘దుమ్మంతా దులిపేయ్ అన్నా’ చీపురు పట్టిన వెన్నెల కిషోర్...


టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ చీపురు పట్టాడు. లాక్ డౌన్‌తో ఇంటికి పరిమితమైన వెన్నెల కిశోర్ తన ఇంట్లో ఈ పనిచేస్తున్నానని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. చీపురు పట్టి చక చక ఇళ్లంతా క్లీన్ చేసేశాడు. ఈ ట్వీట్ పై ఆయన అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అన్నా ఇంకా చాలా చోట్ల దుమ్ము ఉందంటూ ట్వీట్లు పెడుతున్నారు. టేబుల్ కింద, టీవీపైన దుమ్మును క్లీన్ చేయాలని రిప్లై ఇస్తున్నారు. లాక్ డౌన్‌తో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తెలుగు సినిమా తారలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. కొందరు ఇంట్లో ఉండి రకరకాల పనులు చేసుకుంటున్నారు. ఇంటి పనులు, గార్డెన్ పనులు చేస్తున్నారు. మరికొందరు ఇంటి కుటుంబసభ్యులతో హ్యాపీగా గడుపుతున్నారు. నాని వంట చేస్తున్నాడు. నాగశౌర్య అమ్మతో కలిసి అవకాయ పెట్టాడు. ఇక బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్‌లో మేనల్లుడితో సరదాగా గడుపుతున్నాడు. కత్రినా కైఫ్ కిచెన్‌లో అంట్లూ తోముతూ వీడియో పెట్టింది. ఇలా రకరకాలుగా తాము ఇంట్లో ఉండి చేస్తున్న పనుల్ని తారలు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. వెన్నెల సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు కిషోర్. అప్పట్నుంచి అతని పేరు వెన్నెల కిషోర్‌గా మారిపోయింది. ఆ తర్వాత మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న వెన్నెల కోషోర్ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు ఇప్పటివరకు 40కు పైగా సినిమాల్లో నటించాడు.


By March 25, 2020 at 11:22AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/telugu-actor-vennela-kishore-brooming-his-house-post-video-on-social-media/articleshow/74805114.cms

No comments