Breaking News

వివాహితపై సోదరుడి అత్యాచారం.. కర్నూలు జిల్లాలో దారుణం


కరోనా వైరస్ భయంలో దేశమంగా లాక్‌డౌన్ అయినా కూడా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. జిల్లా మండలంలోని నాగలూటి చెంచుగూడెంలో ఓ వివాహితపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. కొద్ది రోజులుగా భర్తకు అనారోగ్యం ఉండడంతో బాధిత మహిళ స్థానిక ఆసుపత్రిలో చూపించింది. మంగళవారం మరోసారి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆటో కోసం బయటకు వెళ్లింది. Also Read: ఆమెపై ఎప్పటినుంచో కన్నేసిన అదే గూడెంకు చెందిన గుర్రప్ప అనే యువకుడు ఆటో తాను చూపిస్తానని నమ్మించాడు. వరుసకు తమ్ముడే కావడంతో ఆమె అతడి మాటలు నమ్మి బయల్దేరింది. వివాహితను బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్తూ మార్గమధ్యలో తన కోరిక తీర్చాలని ఆమె కోరాడు. దీనికి మహిళ అంగీకరించకపోవడంతో పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు విన్న అదే గూడెంకు చెందిన ఓ యువకుడు అక్కడికి వచ్చి వివాహితను మందలించాడు. రాత్రివేళ వాడితో ఇక్కడెందుకు ఉన్నావని నిలదీసి వెళ్లిపోయాడు. Also Read: బాధితురాలు ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఇంటికి వెళ్లిపోయింది. బుధవారం ఆమె భర్త పరిస్థితి విషమంగా మారడంతో 108కు సమాచారమిచ్చింది. బాధితురాలికి కూడా ఆరోగ్యం బాగోలేదని గుర్తించి సిబ్బంది ఆమెను పరీక్షించారు. ఈ సందర్భంగా ముందురోజు తనపై జరిగిన అఘాయిత్యం గురించి ఆమె చెప్పి విలపించింది. దీంతో 108 సిబ్బంది దంపతులను ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న గూడెం పెద్దలు ఇరువర్గాల మధ్య రాజీకి యత్నించినట్లు తెలుస్తోంది. గుర్రప్ప గతంలో సీతమ్మ అనే మహిళను హత్యచేసి జైలు జీవితం గడిపాడు. ఈ విషయం తెలుసుకున్న ఆత్మకూరు పోలీసులు బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By March 26, 2020 at 08:57AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-raped-by-brother-in-kurnool-district/articleshow/74821387.cms

No comments