Breaking News

కరోనా వైరస్ లైవ్‌ అప్‌డేట్స్: పవన్ పెద్ద మనసు.. తెలంగాణలో ఇంటి వద్దకే కూరగాయలు


ఇటలీలో మాత్రం కరోనా కలకం సృష్టిస్తోంది. దాదాపు 6వేలకు పైగా ఇటలీవాసులు ఈ వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికానను కూడా వైరస్ వణికిస్తోంది. స్పెయిన్ లో కూడా కరోనా విజృంభిస్తుంది. నిన్న ఒక్క రోజే ఈ వైరస్ 738 మందిని బలి తీసుకుంది. అయితే ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి వృద్ధులే ఎక్కువమంది చనిపోయారు. తొలిసారిగా 21 ఏళ్ల యువతి ఈ వైరస్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. వికారి నామ సంవత్సరం మహమ్మారి కరోనా వైరస్‌ను ఇచ్చిపోయిందని శార్వరి నామ సంవత్సరంలో కాల సర్పయోగం ఆరుసార్లు కలగడం వల్ల విపత్తులు సంభవిస్తాయని పండితులు అంటున్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంటుందని, మే 22 వరకు ప్రజలు పట్ల జాగ్రత్తగా ఉండాలని, స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ 200 దేశాలకు విస్తరించింది. గతేడాది డిసెంబరు చివరిన చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కొత్తరకం ప్రాణాంతక వైరస్ ఖండంతరాలను దాటి విజృంభిస్తోంది. ఈ మహమ్మారిని అరికట్టడానికి అన్ని దేశాలూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా అన్ని దేశాలనూ ఈ వైరస్‌ బాధిస్తోంది. అనేక దేశాలు ప్రజలను ఇళ్ల నుంచి రానీయకుండా నిషేధాజ్ఞలు విధించాయి. సామాజిక దూరం, ఐసోలేషన్ వల్లే వైరస్‌ను అడ్డుకోవచ్చని పదే పదే నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో 21 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతోంది. వైరస్‌ను వేగంగా వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని, ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పటిష్ట చర్యలు చేపట్టడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 650 దాటింది. మంగళవారంతో పోల్చితే బుధవారం కేసుల సంఖ్య పెరిగింది. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు వారాల పాటూ జనాలు ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్ దెబ్బకు ఒక్కసారిగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇలాంటి కష్టకాలంలో సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. స్పెయిన్, అమెరికా, ఇటలీ వంటి దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ దేశాల్లో ఉన్న భారతీయులు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే కొందరు తిరిగి స్వదేశానికి చేరుకోగా.. కొందరు మాత్రం అక్కడే చిక్కుకుపోయారు. తెలంగాణలో లాక్ డౌన్ ప్రభావంతో దాదాపు ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎంతో మంది ఇలా సెలవులు దొరకడం అరుదని భావించి కుటుంబంతోనే సమయం గడుపుతున్నారు. ఇళ్లలోనే ఉండి చేయగలిగే పనులను చేసుకుంటున్నారు. పని మనుషులు కూడా తమ ఇళ్లకే పరిమితం కావడంతో మరికొందరు తమ ఇళ్లను తామే శుభ్రం చేసుకుంటున్నారు. . తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్‌ ప్రభావంతో మంత్రి కేటీఆర్, హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలుత లాక్‌డౌన్ సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న అన్నపూర్ణ కేంద్రాలను సైతం మూసేయాలని అనుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ పరిస్థితుల్లో ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు సైతం ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇంటికి ఒకరు చొప్పున దుకాణాలకు వెళ్లొచ్చని ప్రభుత్వం అనుమతించినా ప్రధాన రహదారుల గుండా వెళ్లాల్సిన వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పోలీసులు వారిని ఆపి, అనుమతించకపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి.


By March 26, 2020 at 09:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-news-updates-in-andhra-pradesh-and-telangana-across-india-and-globally-in-telugu/articleshow/74821819.cms

No comments