డిసెంబర్‌లో పెళ్లి.. జనవరిలో భార్య, మార్చిలో భర్త ఆత్మహత్య

హైదరాబాద్‌లో నూతన జంట జీవిత ప్రయాణం విషాదాంతమైంది. గతేడాది డిసెంబర్ నెలలో ఘనంగా వివాహం చేసుకున్న జంట... అనూహ్య రీతిలో ఆత్మహత్య చేసుకున్నారు. వరకట్న వేధింపులో భార్య జనవరి నెలలో బలవన్మరణానికి పాల్పడగా.. అదే కేసులో జైలుకెళ్లి తిరిగొచ్చిన భర్త లాడ్జిలో శవమై కనిపించాడు. ఈ విషాద ఘటన పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. Also Read: మలక్‌పేటకు చెందిన లక్ష్మీ, చంద్రశేఖర్ కుమార్తె పల్లవి(29)ని నల్లగొండ జిల్లా, మునుగోడుకు చెందిన సోమవరపు విజయలక్ష్మి, శ్రీహరి కుమారుడు సంతోష్ కుమార్(32)కు ఇచ్చి గతేడాది డిసెంబర్ 8న ఘనంగా వివాహం చేశారు. దంపతులిద్దరూ వనస్థలిపురంలోని శ్రీనివాసపురం కాలనీలో కాపురం పెట్టారు. వీరిద్దరూ ఎంబీఏ పూర్తి చేశారు. పల్లవి ఓ ప్రైవేటు కంపెనిలో పని చేస్తుండగా, సంతోష్ కుమార్ మనుగోడులో భారత్ గ్యాస్ ఏజెన్సీని నిర్వహస్తున్నాడు. పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు ఇచ్చినప్పటికీ పల్లవిని అత్తమామలు వేధించసాగారు. పుట్టింటికి వెళ్లి మరింత కట్నం తీసుకురావాలంటూ సూటిపోటి మాటలు అనేవారు. Also Read: ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పుకోలేక, మనస్తాపానికి గురైన పల్లవి జనవరి 31 ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పల్లవి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు సంతోష్‌ను అరెస్ట చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్ రావడంతో బయటకు వచ్చిన సంతోష్ శనివారం ఆటోనగర్‌లోని ఓయో లాడ్జిలో రూమ్ తీసుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By March 23, 2020 at 08:29AM
No comments