Breaking News

నాంపల్లి రైల్వే స్టేషన్లో కరోనా అనుమానితుడు


హైదరాబాద్: నాంపల్లి రైల్వే స్టేషన్లో కనిపించడం ఆందోళన కలిగించింది. హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ ప్రాంతానికి మోసిన్ అలీ అనే వ్యక్తి నైజీరియాలోని లాగోస్ నగరం నుంచి అబుదాబీ మీదుగా విమానంలో ముంబై చేరుకున్నాడు. అక్కడి నుంచి ముంబై ఎక్స్‌ప్రెస్ రైల్లో ఆదివారం ఉదయం చేరుకున్నాడు. కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో విదేశాల నుంచి తిరిగొచ్చిన వారికి 14 రోజులపాటు హోమ్ క్వారంటైన్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. వారు బయట తిరిగితే గుర్తించేందుకు వీలుగా చేతిపై స్టాంప్ వేస్తున్నారు. మోసిన్ చేతిపై హోమ్ క్వారంటైన్ స్టాంప్ ఉండటాన్ని సాయిరామ్ అనే తోటి ప్రయాణికుడు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో నాంపల్లి రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు 108 వాహనంలో మోసిన్‌ను గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఇక్కడే అతణ్ని క్వారంటైన్లో ఉంచనున్నారు. శనివారం కాజీపేట జంక్షన్లోనూ ఇద్దరు కరోనా అనుమానితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రవి, పూజ అనే ఇద్దరు విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి క్వారంటైన్ కేంద్రానికి తరలించగా తప్పించుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. వారి చేతికి ఉన్న స్టాంప్‌ను గమనించిన తోటి ప్రయాణికులు కూపీ లాగడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కాజీపేట జంక్షన్లో రైలును ఆపి వారిని ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు.


By March 22, 2020 at 10:09AM


Read More https://telugu.samayam.com/telangana/news/corona-suspected-in-nampally-railway-station-railway-police-sent-him-to-gandhi-hospital/articleshow/74755768.cms

No comments