Breaking News

నచ్చిన హీరోతో మరోసారి జతకడుతున్న కాజల్


సినీ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అందుకొని అగ్రతారల సరసన పదేళ్ల కెరీర్‌లో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ కాజల్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ... ఆ తర్వాత వరుస ఆఫర్లు కొట్టేసింది. తెలుగులో అగ్రహీరోలందరితో జతకట్టి మంచి సక్సెస్ అందుకుంది. అటు కోలీవుడ్, బాలీవుడ్‌లో కూడా కాజల్ హవా కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ తమిళ హీరోతో మరోసారి జత కొట్టే ఛాన్స్ కొట్టేసింది కాజల్. అంతేకాదు అతడే ఆమెకు బాగా నచ్చే హీరో అని కూడా స్వయంగా కాజల్ చెబుతుంది. దీనికి సంబంధించి ఈ ముద్దుగుమ్మ ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. అందులో తనకు బాగా నచ్చిన నటుడు దళపతి విజయ్‌ అని పేర్కొంది కాజల్. తామిద్దరం కలిసి త్వరలో మరోసారి నటించనున్నట్లు చెప్పింది. దీంతో తుపాకీ-2లో ఈ అమ్మడు విజయ్‌తో మరోసారి రొమాన్స్‌ చేయనుందని కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. తుపాకీ చిత్రంలో హీరోయిన్‌. దీంతో దాని సీక్వెల్‌లోనూ కాజల్‌ నే హీరోయిన్‌గా ఎంపిక చేసుకుని ఉంటారని అంతా అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఇండియన్‌-2 చిత్రంలో కమలహాసన్‌తోనూ, దుల్కర్‌సల్మాన్‌కు జంటగా ఒక చిత్రంలోనూ కాజల్ నటిస్తోంది. ఇటు తెలుగులో కూడా మెగాస్టర్ కొత్త మూవీలో కాజల్‌నే ఫిక్స్ చేశారు. ఖైదీ నెంబర్ 150లో చిరుతో జతకట్టిన కాజల్.... మరో మెగాస్టార్ మూవీ అయిన ‘ఆచార్య’లో కూడా ీ ముద్దుగుమ్మ మెరుస్తోందని చిత్ర యూనిట్ చెబుతున్నాయి. మొత్తం మీద కాజల్‌కు కోలీవుడ్ టు టాలీవుడ్ గుడ్ టైమ్ నడుస్తుంది.


By March 25, 2020 at 10:14AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kajal-aggarwal-to-team-up-with-vijay-again-for-thuppakki-2/articleshow/74804164.cms

No comments